SNP
Liton Das, BAN vs PAK: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ లిట్టన్ దాస్.. పాకిస్థాన్‌పై శివాలెత్తాడు. 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జట్టును 262 పరుగులకే చేర్చాడు. ఆ అద్భుత ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Liton Das, BAN vs PAK: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ లిట్టన్ దాస్.. పాకిస్థాన్‌పై శివాలెత్తాడు. 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జట్టును 262 పరుగులకే చేర్చాడు. ఆ అద్భుత ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తీవ్ర కష్టాల్లో పడింది. తొలి టెస్ట్‌ను అసాధారణ రీతిలో గెలిచి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. రెండో టెస్టులో అదే జోరును చూపించాలని అనుకుంది. కానీ, ఈ సారి పాకిస్థాన్ బౌలర్లు బంగ్లాను బాగానే ఇబ్బంది పెట్టారు. కానీ, ఎంతలా అంటే.. కేవలం 26 పరుగులకే 6 వికెట్లు కూల్చారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనిపించింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి.. పాకిస్థాన్ బాగానే ప్రతీకారం తీర్చుకుంటుందిగా అనిపించింది. కానీ.. అప్పుడో లిట్టన్ దాస్ ఓ హీరోలా.. పాకిస్థాన్ ముందు నిలబడ్డాడు.
పాకిస్థాన్ బౌలింగ్ ఎటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. సెంచరీతో వీరోచితంగా పోరాడి.. సెంచరీతో బంగ్లాదేశ్‌ను ఆదుకున్నాడు. 26 పరుగులుకే 6 వికెట్లు కోల్పోయి జట్టు.. 262 పరుగులు చేస్తుందని ఎవరైనా అనుకుంటారా? కానీ అలాంటి అద్భుతాన్ని చేసి చూపించాడు లిట్టన్ దాస్. ఇస్లామ్ 10, జాకీర్ హసన్ 1, కెప్టెన్ షాంటో 4, మొమినుల్ 1, లాస్ట్ మ్యాచ్ సెంచరీ హీరో ముష్ఫికర్ రహీమ్ 3, సీనియర్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ 2 పరుగులు మాత్రమే చేసి.. పెవిలియన్‌కు క్యూ కడితే.. ఒకే ఒక్కడు దాస్.. పాకిస్థాన్‌కు కొరకరాని కొయ్యగా మారాడు.
171 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 228 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సులతో 138 పరుగులు చేసి.. 9వ వికెట్‌గా వెనుదిరగాడు. దాస్‌ను ఔట్ చేసే సరికి పాకిస్థాన్ తల ప్రాణం తొకకొచ్చింది. మొత్తంగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకంటే ముందు.. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 274 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సైమ్ అయ్యూబ్ 58, కెప్టెన్ షాన్ మసూద్ 57, అఘా సల్మాన్ 54 పరుగులతో రాణించారు. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది పాకిస్థాన్. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ను తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేసి.. తర్వాత టార్గెట్ ఛేజ్ చేసి గెలిస్తే.. 2-0తో పాకిస్థాన్‌ను వాళ్ల సొంతగడ్డపై టెస్టుల్లో వైట్‌వాష్ చేసి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించడ ఖాయం. మరి ఈ మ్యాచ్‌లో లిట్టన్ దాస్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🤝 165-run stand with Mehidy Hasan Miraz
💪 69-run partnership with Hasan MahmudFrom 26/6, Litton Das and the lower order have taken Bangladesh to just 12 runs shy of Pakistan’s total in Rawalpindi 😮 https://t.co/1CSHXUZXFy #PAKvBAN pic.twitter.com/7EUii19DoI
— ESPNcricinfo (@ESPNcricinfo) September 1, 2024