వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్న బంగ్లా స్టార్ క్రికెటర్.. ఫ్యామిలీతో కలసి వేడుకలు!

Liton Das, Ganesh Chaturthi 2024: దేశమంతా వినాయక చవితి పండుగను గ్రాండ్​గా సెలబ్రేట్ చేసుకున్నారు. టీమిండియా ప్లేయర్లు కూడా ఫెస్టివల్​ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఓ బంగ్లాదేశ్ స్టార్ కూడా సంబురాల్లో మునిగిపోయాడు.

Liton Das, Ganesh Chaturthi 2024: దేశమంతా వినాయక చవితి పండుగను గ్రాండ్​గా సెలబ్రేట్ చేసుకున్నారు. టీమిండియా ప్లేయర్లు కూడా ఫెస్టివల్​ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఓ బంగ్లాదేశ్ స్టార్ కూడా సంబురాల్లో మునిగిపోయాడు.

దేశమంతా వినాయక చవితి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మండపాలతో పాటు ఇళ్లలోనూ గణేషుడి విగ్రహాలను ప్రతిష్టించి పూలతో అలంకరించి, నైవేద్యాలు సమర్పించి, విఘ్నాలు తొలగించమని కోరుకున్నారు భక్తులు. వినాయకుడి భజనలు, పాటలతో పండుగ కళ ఉట్టిపడింది. ఆ సిటీ, ఈ సిటీ అనే తేడాల్లేకుండా దేశం మొత్తం గణేశ్ చతుర్థి ఉత్సవాలు ఊపందుకున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. టీమిండియా ప్లేయర్లు కూడా ఈ ఫెస్టివల్​ను ఘనంగా జరుపుకుంటున్నారు. బుజ్జి వినాయకుడి ప్రతిమలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వీళ్లే కాదు.. ఓ బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ కూడా వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా జరుపుకోవడం విశేషం. ఎవరా క్రికెటర్? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్ లిటన్ దాస్ గణేశ్ చతుర్థిని ఘనంగా జరుపుకున్నాడు. కుటుంబంతో కలసి పండుగను వైభవంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​లో అతడు షేర్ చేశాడు. సంప్రదాయ దుస్తులు ధరించిన లిటన్ తన భార్యతో కలసి దీపాలు వెలిగించి గణేషుడి ముందు పెట్టాడు. చుట్టూ పువ్వులు, వాటి మధ్య కొలువు దీరిన బొజ్జ గణపయ్య, ఆయన మెడలో మల్లె పూల దండ, అక్కడక్కడా దీపాలు, ప్రసాదం లాంటివన్నీ ఈ ఫొటోల్లో చూడొచ్చు. లిటన్​తో పాటు అతడి భార్య దేవాశ్రీ బిస్వాస్ సోంచిత కూడా ట్రెడిషనడ్ డ్రెస్​లో సంబురాల్లో పాల్గొన్నారు. ఇద్దరి లుక్స్ చాలా బాగున్నాయని ఫొటోలు చూసిన నెటిజన్స్ అంటున్నారు. క్యూట్ పెయిర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా పండుగను సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా సంస్కృతి, సంప్రదాయాలకు లిటన్ ఎంత విలువ ఇస్తాడో అర్థమవుతోందని అంటున్నారు.

ఇక, బంగ్లాదేశ్​కు ఆడిన అతికొద్ది మంది హిందూ ప్లేయర్లలో లిటన్ దాస్ ఒకడు. అతడి పూర్తి పేరు లిటన్ కుమార్ దాస్. 1994, అక్టోబర్ 13వ తేదీన బంగ్లాదేశ్, దినాజ్​పూర్​లోని బెంగాలీ హిందూ కుటుంబంలో అతడు పుట్టాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన దాస్.. బంగ్లా టీమ్​కు వికెట్ కీపర్​గానూ వ్యవహరిస్తున్నాడు. ఆ టీమ్ బ్యాటింగ్ యూనిట్​కు మూలస్తంభంగా మారిన దాస్.. ఇటీవల పాకిస్థాన్​తో జరిగిన టెస్ట్ సిరీస్​లోనూ దుమ్మరేపాడు. అద్భుతమైన సెంచరీతో రెండో టెస్ట్​ను బంగ్లా వైపు తిప్పాడు. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్​లో నెగ్గిన పర్యాటక జట్టు.. రెండో విజయంతో పాక్​ను క్లీన్​స్వీప్ చేసింది. పాక్​ను వాళ్ల సొంతగడ్డ మీదే వైట్​వాష్ చేయడంతో బంగ్లా క్రికెటర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ టీమ్ కెప్టెన్ నజ్ముల్ షంటో అయితే ట్రోఫీని పక్కనే పెట్టుకొని నిద్రపోయాడు. సెంచరీ హీరో దాస్ కూడా తనదైన స్టైల్​లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ సంతోషంతోనే తాజాగా వినాయక చవితిని కూడా గ్రాండ్​గా జరుపుకున్నాడు.

Show comments