ఓ ప్రముఖ క్రికెట్ టోర్నీకి సంబంధించిన ట్రోఫీని వందే భారత్ రైళ్లో ఊరేగించడానికి సర్వం సిద్ధమైంది. అయితే క్రికెట్ ట్రోఫీని వందే భారత్ ట్రైన్ లో దేశవ్యాప్తంగా ఊరేగించడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ ప్రముఖ క్రికెట్ టోర్నీకి సంబంధించిన ట్రోఫీని వందే భారత్ రైళ్లో ఊరేగించడానికి సర్వం సిద్ధమైంది. అయితే క్రికెట్ ట్రోఫీని వందే భారత్ ట్రైన్ లో దేశవ్యాప్తంగా ఊరేగించడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకు పెరుగుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 33 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునే విధంగా వీటిని తీర్చిదిద్దారు. ఇక ఈ రైళ్లలో కొన్ని ప్రత్యేకతలు ఉండటం వల్ల వీటిల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తిచూపుతున్నారు. దీంతో వాటికి విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. అయితే సాధారణ రైళ్లతో పొల్చుకుంటే వీటిల్లో టికెట్ ధర అధికమే అయినప్పటికీ.. తక్కువ టైమ్ లోనే గమ్యస్థానాలను చేర్చుతోంది వందే భారత్ రైలు. ఇదిలా ఉండగా.. ఓ ప్రముఖ క్రికెట్ టోర్నీకి సంబంధించిన ట్రోఫీని వందే భారత్ రైళ్లో ఊరేగించడానికి సర్వం సిద్ధమైంది.
వందే భారత్ రైళ్లకు దేశం లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైళ్వే శాఖ మరిన్ని సదుపాయాలను తీసుకోస్తోంది. కొత్తగా స్లీపర్ రైళ్లను త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. 2024 ఫిబ్రవరి నాటికి ఈ రైళ్లు పరుగులు పెడతాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వీటికి ఉన్న ఆదరణను లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు వినియోగించుకోనున్నారు. అందులో భాగంగా.. దేశ వ్యాప్తంగా లెజెండ్స్ లీగ్ ట్రోఫీని ఊరేగించనున్నారు. భారతదేశంలో క్రీడారంగాన్ని మరింత ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లీగ్ నిర్వాహకులు తెలియజేశారు. కాగా.. నవంబర్ 8వ తేదీన వందే భారత్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ ట్రోఫీ టూర్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో,కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ రైలు ప్రయాణిస్తుంది.
ఈ టూర్ 15 రోజుల పాటు కొనసాగుతుందని లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ రవిశాస్త్రి వెల్లడించాడు. ఇందుకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రవిశాస్త్రి వివరించాడు. నార్త్, సౌత్, సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ రైల్వే జోన్ల మీదుగా ఈ రైల్ రాకపోకలు సాగిస్తుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా లెజెండ్స్ లీగ్ నవంబర్ 18 నుంచి మెుదలు కానుంది. ప్రారంభ కార్యక్రమంలో సచిన్, గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. మెుత్తం 6 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ 2వ ఎడిషన్ కావడం విశేషం. టోర్నీలో గుజరాత్ జెయింట్స్, అర్బన్ రైజర్స్ హైదరాబాద్, సదరన్ సూపర్ స్టార్స్, భిల్వారా కింగ్స్,ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్ జట్లు ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. విశాఖపట్నం కూడా ఈ మ్యాచ్ లకు వేదికకానుంది. తొలి ఎడిషన్ లో ట్రోఫీని గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని ఇండియా క్యాపిటల్స్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.