iDreamPost
android-app
ios-app

Team India: మ్యాచ్‌ ఓడినా.. భారత క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి టీమ్‌ చూసి ఉండరు!

  • Published Dec 13, 2023 | 1:00 PM Updated Updated Dec 13, 2023 | 1:00 PM

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఓడిపోయినా.. ఆ జట్టులో ఓ స్పెషాలిటీ దాగి ఉంది. అది గుర్తిస్తే.. ఎవరైనా వావ్‌.. ఇట్స్‌ లుకింగ్‌ లైక్‌ వావ్‌! అనాల్సిందే. ఇంతకీ టీమిండియాలో ఉన్న స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఓడిపోయినా.. ఆ జట్టులో ఓ స్పెషాలిటీ దాగి ఉంది. అది గుర్తిస్తే.. ఎవరైనా వావ్‌.. ఇట్స్‌ లుకింగ్‌ లైక్‌ వావ్‌! అనాల్సిందే. ఇంతకీ టీమిండియాలో ఉన్న స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 13, 2023 | 1:00 PMUpdated Dec 13, 2023 | 1:00 PM
Team India: మ్యాచ్‌ ఓడినా.. భారత క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి టీమ్‌ చూసి ఉండరు!

భారత క్రికెట్‌ చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప జట్లు వచ్చాయి. వరల్డ్‌ కప్‌లు గెలిచిన జట్లు ఉన్నాయి. కప్పులు గెలవకపోయినా చరిత్రను తిరగరాసిన జట్లు ఉన్నాయి. కానీ, మంగళవారం సౌతాఫ్రికాతో ఆడిన ఇండియన్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ మాత్రం భారత క్రికెట్‌ చరిత్రలోనే ఓ అద్భుతమైన, భిన్నమైన జట్టుగా పేర్కొనవచ్చు. ఇన్‌ఫ్యాక్ట్‌.. నిన్నటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో సూర్య సేన ఓటమి పాలు కావచ్చు. అయినా కూడా ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలోనే ఏ క్రికెట్‌ అభిమాని కూడా ఇలాంటి టీమ్‌ని చూసి ఉండరంటూ క్రికెట్‌ నిపుణులే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం ఈ యంగ్‌ టీమిండియాలో ఓ స్పెషాలిటీ ఉంది. గతంలో ఏ టీమ్‌లో కూడా ఇలాంటి మ్యాజిక్‌ జరగలేదు. మరి అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

సౌతాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓడిపోయిన విషయాన్ని కాసేపు పక్కనపెట్టి.. ఆసలు బరిలోకి దిగిన ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఒకసారి గమనిస్తే.. బ్యాటింగ్‌ ఆర్డర్‌.. ఒకటో స్థానం నుంచి ఏడో స్థానం వరకు ఒక మిరాకిల్‌ చూడొచ్చు. అదేంటంటే.. ఒకటి నుంచి ఏడో నంబర్ వరకు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ కాంబినేషన్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉంది. యశస్వి జైస్వాల్‌ లెఫ్ట్‌ హ్యాండెడ్‌ బ్యారట్‌, అతనికి జోడి అయిన శుబ్‌మన్‌ గిల్‌ రైట్‌ హ్యాండ్‌, వన్‌ డౌన్‌లో వచ్చిన తిలక్‌ వర్మ లెఫ్ట్‌ హ్యాండ్‌, నాలుగో స్థానంలో వచ్చిన సూర్య రైట్ హ్యాండ్‌, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ సింగ్‌ లెఫ్ట్‌, ఆరో స్థానంలో జితేష్‌ శర్మ రైట్‌ హ్యాండ్‌, ఇక బౌలర్లు కాకుండా క్వాలిటీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో చివరిదైన ఏడో స్థానంలో రవీంద్ర జడేజా లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌.

team india creates history

మొత్తంగా.. లెఫ్ట్‌, రైట్‌, లెఫ్ట్‌, రైట్‌, లెఫ్ట్‌, రైట్‌, లెఫ్ట్‌గా టీమిండియా బ్యాటింగ్‌ సాగింది. ఈ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఒక భారత జట్టుదంటే బహుషా చాలా మంది క్రికెట్‌ అభిమానులు నమ్మలేకపోవచ్చు. ఎందుకంటే ఇండియాకు మొదటి నుంచి రైట్‌ హ్యాండెడ్‌ బ్యాటర్లే ఎక్కువ. లెఫ్ట్‌ హ్యాండర్లు తక్కువ. కానీ, ఇప్పుడు మాత్రం కావాల్సినంత మంది లెఫ్ట్‌ హ్యాండర్లు ఉన్నారు. ఒకప్పటి ఆస్ట్రేలియా జట్టును తలపిస్తోంది ఈ యంగ్‌ టీమిండియా. అయితే.. క్రికెట్‌లో రైట్‌, లెఫ్ట్‌ బ్యాటింగ్‌ కాంబినేషన్‌ ఉంటే ఎంత అడ్వాంటేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకే సారి క్రీజ్‌లో ఒక రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌, ఒక లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌ ఉంటే.. స్ట్రైక్‌ రోటేట్‌ అయిన ప్రతి సారి బౌలర్‌ తన స్టైక్‌ మార్చుకోవాలి, అలాగే ప్రత్యర్థి కెప్టెన్లు తరచూ ఫీల్డింగ్‌ను మార్చాల్సి ఉంటుంది. ఇది వారికి పెద్ద తలనొప్పి పని. అలాగే రైట్‌ హ్యాండర్‌ బ్యాటర్లు లెఫ్ట్‌ ఆర్మ్‌ సీమర్లకు కాస్త ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో లెఫ్ట్‌ హ్యాండర్‌ క్రీజ్‌లో ఉంటే హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. రైట్‌, లెఫ్ట్‌ కాంబినేషన్‌తో ఇలా అనేక అడ్వాంటేజ్‌లు ఉంటాయి. మరి ప్రస్తుతం యంగ్‌ టీమ్‌లో ఫర్ఫెక్ట్‌ లెఫ్ట్‌, రైట్‌ కాంబినేషన్‌ ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.