యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్ లో ఆసీస్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్నతొలి టెస్ట్ లో విజయం కోసం ఇంగ్లాండ్-ఆసిస్ జట్లు హోరాహోరిగా పోరాడుతున్నాయి. ఇక నాలుగో రోజు ఆటలో ఆసిస్ చీటింగ్ చేసింది. దాంతో నెటిజన్లు ఆసిస్ జట్టును, లబూషేన్ ను ఏకిపారేస్తున్నారు. మీ బుద్ది ఇకనైనా మారదా? అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. అసలు నాలుగో రోజు ఆటలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్-ఆసిస్ మధ్య తొలి టెస్ట్ జరుగుతోంది. నాలుగు రోజుల ఆట ముగియగా.. ఒక్క రోజు ఆట మిగిలి ఉంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయానికి 7 వికెట్లు అవసరం కాగా.. ఆస్ట్రేలియా గెలుపుకు 174 పరుగులు కావాలి. దాంతో విజయావకాశాలు ఎక్కువగా ఆసిస్ వైపే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతం చేస్తే తప్ప ఫలితం మారదు. ఇక ఈ మ్యాచ్ లో ఆసిస్ మరోసారి తన వక్రబుద్దిని చూపించింది. తన చీటింగ్ స్ట్రాటజీని బయటపెట్టుకుంది. ఈ ఘటన నాలుగో రోజు ఇన్నింగ్స్ 55వ ఓవర్ లో చోటు చేసుకుంది. హాజిల్ వుడ్ బౌలింగ్ చేస్తుండగా.. క్రీజ్ లో ఓలీ రాబిన్ సన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు లబూషేన్. హాజిల్ వుడ్ వేసిన బౌన్సర్ ను అడ్డుకోబోయిన రాబిన్ సన్ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న లబూషేన్ కు క్యాచ్ ఇచ్చాడు. ఇక క్యాచ్ పట్టగానే సంబరాలు చేసుకున్నాడు లబూషేన్. దాంతో ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వగా.. రాబిన్ సన్ రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో స్పష్టంగా బాల్ నేలను తాకినట్లు తేలింది. దాంతో థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. ఇక ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. లబూషేన్ ను ఏకిపారేస్తున్నారు క్రీడాభిమానులు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్దమని, తొండాటకు ఆసిస్ ఆటగాళ్లు కేరాఫ్ అడ్రస్ అని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.
Whi this Not out . The way labuschagne was celebrating, it shows the great sportsmanship of Aussies 😂. @ShubmanGill pic.twitter.com/PgYdwIyase
— niraj kumar (@nirajku1234) June 19, 2023