iDreamPost
android-app
ios-app

కోహ్లీ గురించి అలా మాట్లాడి తప్పు ఒప్పుకున్న స్టార్‌ క్రికెటర్‌!

  • Published Nov 12, 2023 | 5:55 PM Updated Updated Nov 12, 2023 | 5:55 PM

విరాట్‌ కోహ్లీ విషయంలో అలా రియాక్ట్‌ అయినందుకు శ్రీలంక తాత్కాలిక కెప్టెన్‌ కుసాల్‌ మెండిల్‌ సారీ చెబుతున్నాడు. ఇంతకీ అసలు కోహ్లీ విషయంలో కుసాల్‌ చేసిన తప్పేంటి? ఎందుకు అతనిలో ఈ రియలైజేషన్‌ వచ్చిందో ఇప్పుడు చూద్దాం..

విరాట్‌ కోహ్లీ విషయంలో అలా రియాక్ట్‌ అయినందుకు శ్రీలంక తాత్కాలిక కెప్టెన్‌ కుసాల్‌ మెండిల్‌ సారీ చెబుతున్నాడు. ఇంతకీ అసలు కోహ్లీ విషయంలో కుసాల్‌ చేసిన తప్పేంటి? ఎందుకు అతనిలో ఈ రియలైజేషన్‌ వచ్చిందో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 12, 2023 | 5:55 PMUpdated Nov 12, 2023 | 5:55 PM
కోహ్లీ గురించి అలా మాట్లాడి తప్పు ఒప్పుకున్న స్టార్‌ క్రికెటర్‌!

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఎలాంటి స్టార్‌డమ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రేజ్‌, స్టార్‌డమ్‌ను పక్కనపెట్టినా.. వరల్డ్‌ కప్‌లో మోడ్రన్‌ గ్రేట్స్‌లో కోహ్లీనే నంబర్‌ వన్‌ ఆటగాడు. అలాంటి ఆటగాడి గురించి ఏ విషయంపై స్పందించినా.. కాస్త వెనుకా ముందు ఆలోచించి స్పందించాలి. ఎందుకంటే కాస్త అటూ ఇటూగా కోహ్లీకి వ్యతిరేకంగా ఉన్నా.. కోహ్లీ అభిమానులు ఊరుకోరు. ఎందుకంటే కోహ్లీ కేవలం క్రికెటర్‌ మాత్రమే కాదు. కొన్ని కోట్ల మందికి ఎమోషన్‌. అయితే.. తాజాగా శ్రీలంక తాత్కాలిక కెప్టెన్‌ కుసాల్‌ మెండిస్‌ కోహ్లీ గురించి నిర్లక్ష్యంగా మాట్లాడి ఇప్పుడు బాధ పడుతున్నాడు.

కోహ్లీ గురించి నేను అలా మాట్లాడిల్సింది కాదు, తప్పు నాదే. నిజానికి నాకు ఆ విషయంపై అవగాహన లేదంటూ తాజాగా చెప్పుకోచ్చాడు కుసాల్‌ మెండిస్‌. ఇంతకీ మెండిస్‌.. కోహ్లీ గురించి ఏం తప్పుగా మాట్లాడాడు అని ఆలోచిస్తున్నారా? ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అద్భుతంగా ఆడి సెంచరీ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఆ సెంచరీతో వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్‌ రికార్డును కోహ్లీ సమం చేశాడు. క్రికెట్‌ చరిత్రలోనే వన్డేల్లో 49 సెంచరీలు చేసిన ఆటగాళ్లు ఇద్దరే ఇద్దరు. ఒకరు సచిన్‌, ఇంకొకరు కోహ్లీ. అంత గొప్ప రికార్డును కోహ్లీ సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా అతనిపై ప్రశంసల వర్షం కురిసింది.

కానీ, అదే సమయంలో ఓ ప్రెస్‌మీట్‌కు హాజరైన కుసాల్‌ మెండిస్‌ను ఓ జర్నలిస్ట్‌.. విరాట్‌ కోహ్లీ 49వ సెంచరీ చేయడంపై మీరు ఏం అంటారు? అతని కంగ్రాట్స్‌ చెప్తారా? అని ప్రశ్నించగా.. దానికి బదులిస్తూ.. నేనేందుకు కంగ్రాట్స్‌ చెబుతాను అంటూ వెకిలిగా నవ్వాడు మెండిస్‌ దీంతో.. క్రికెట్‌ అభిమానులు అతనిపై విరుచుకుపడ్డాడు. ఒక గొప్ప ఆటగాడు గొప్ప రికార్డు సాధించనప్పుడు సాటి క్రికెటర్‌గా కనీసం కంగ్రాట్స్‌ చెప్పడానికి అంత షో అవసరమా అంటూ మండిపడ్డారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన కుసాల్‌.. నిజానికి ఆ రోజు నాకు క్వశ్చన్‌ అర్థం కాలేదని, కోహ్లీ 49వ సెంచరీ సాధించిన విషయం కూడా తనకు తెలియదని, కోహ్లీ గొప్ప ఆడగాడంటూ పేర్కొన్నాడు. ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నావ్‌ గుడ్‌ అంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.