Tirupathi Rao
Tirupathi Rao
వన్డే వరల్డ్ కప్ 2023 ఉత్కంఠగా సాగుతోంది. 8వ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా శ్రీలంక- పాకిస్తాన్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక బ్యాటింగ్ లో దూసుకుపోతోంది. పాక్ బౌలర్లను లంక బ్యాటర్లు వణికిస్తున్నారు. రెండో ఓవర్ లోనే వికెట్ కోల్పోయి కాస్త తడబడినట్లు కనిపించిన శ్రీలంక జట్టు.. తర్వాత నిలదొక్కుకుని అద్భుతంగా రాణిస్తోంది. మరీ ముఖ్యంగా కుశాల్ మెండిస్ విజృంభణ పాక్ బౌలర్లకు దడ పుట్టిస్తోంది. ఈ వరల్డ్ కప్ లో శ్రీలంక ట్రంప్ కార్డుగా కుశాల్ మెండిస్ కనిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రత్యర్థి ఎవరైనా మెండిస్ మాత్రం చెలరేగి ఆడుతున్నాడు.
కుశాల్ మెండిస్.. ప్రస్తుతం ఈ పేరు వన్డే వరల్డ్ కప్ లో మారుమోగుతోంది. ఎందుకంటే బౌలర్ ఎవరైనా విచక్షణారహితంగా దండిస్తున్నాడు. ఫియర్ లెస్ గా అతను చేస్తున్న బ్యాటింగ్ చూసి వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్లు కూడా వణికిపోయే పరిస్థితి కనిపిస్తోంది. సౌత్ ఆఫ్రికాపై జరిగిన మ్యాచ్ లో కూడా కేవలం 42 బంతుల్లోనే 76 పరుగులు చేసి సత్తా చాటాడు. తాజాగా పాకిస్తాన్ జట్టుకైతే చుక్కలు చూపించాడు. కొత్త పాత లేదు.. వచ్చిన ప్రతి బౌలర్ ను ఉతికేశాడు. వరుసగా ఫోర్లు, వరుస సిక్సులతో విజృంభించాడు. సిక్సర్ తో సెంచరీ చేసి శభాష్ అనిపించుకున్నాడు. కేవలం 77 బంతుల్లోనే 14 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 122 పరుగులు పూర్తి చేసుకున్నాడు. వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా నిలిచాడు.
అయితే ఇదే సునామీ కొనసాగితే శ్రీలంక స్కోర్ కచ్చితంగా 400కు చేరేదేమో? కానీ, మెండిస్ నిష్క్రమించడంతో పాక్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. రెండు వరుస సిక్సర్లు కొట్టి మూడో బంతిని కూడా భారీ షాట్ ట్రై చేసి బౌండరీపై ఇమామ్ హుల్ హక్ కి చిక్కాడు. ఈ ఆటలో కుశాల్ మెండిస్ పోరాటం ముగిసినా.. వరల్డ్ కప్ కి సంబంధించి మాత్రం చాలా జట్లకు ఇది వేకప్ కాల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి బాల్ వేసినా కూడా మెండిస్ గురి మాత్రం బౌండరీ మీదే ఉంటోంది. కాబట్టి భారత్ లాంటి జట్లు కూడా మెండిస్ కోసం ప్రత్యేకంగా వ్యూహాలు రచించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మెండిస్ ని ఏ జట్టు లైట్ తీసుకున్నా భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. మ్యాచ్ లో 30 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. నిస్సాంక(51), కుశాల్ పెరేరా(0), కుశాల్ మెండిస్(122) పరుగులు చేశారు. పాక్ బౌలింగ్ లో హసన్ అలీకి 2 వికెట్లు, షదాబ్ ఖాన్ కు వికెట్ దక్కింది. మరి.. కుశాల్ మెండిస్ వీరోచిత పోరాటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The fastest century by a Sri Lankan at a Men’s #CWC 💯🇱🇰@mastercardindia Milestones 🏏 #CWC23 #PAKvSL pic.twitter.com/4Afiq6ss0e
— ICC (@ICC) October 10, 2023