iDreamPost

టీ20 వరల్డ్ కప్ లో ఎక్కువ వికెట్లు తీసేది అతడే! టాప్ స్కోరర్..: క్రికెట్ దిగ్గజం

టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసేది అతడే అని, టాప్ స్కోరర్ గా నిలిచేది ఆ ప్లేయరే అంటూ జోస్యం చెప్పాడు విండీస్ దిగ్గజం. ఎవ్వరూ ఊహించని పేర్లు చెప్పుకొచ్చాడు ఈ లెజెండ్. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసేది అతడే అని, టాప్ స్కోరర్ గా నిలిచేది ఆ ప్లేయరే అంటూ జోస్యం చెప్పాడు విండీస్ దిగ్గజం. ఎవ్వరూ ఊహించని పేర్లు చెప్పుకొచ్చాడు ఈ లెజెండ్. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో ఎక్కువ వికెట్లు తీసేది అతడే! టాప్ స్కోరర్..: క్రికెట్ దిగ్గజం

టీ20 వరల్డ్ కప్ 2024పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక దిగ్గజ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు తమ ప్రిడిక్షన్స్ చెబుతూ.. హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆ జట్టు ఫైనల్ కు వెళ్తుంది, ఈ జట్టు కప్ కొడుతుంది.. ఆ ప్లేయర్ ఎక్కువ పరుగులు.. ఈ ఆటగాడు అత్యధిక వికెట్లు తీస్తాడు అంటూ దిగ్గజాలు జోస్యం చెబుతున్నారు. దాంతో క్రికెట్ ప్రేమికుల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో విండీస్ లెజెండ్ బౌలర్ ఇయాన్ బిషప్ సైతం టీ20 వరల్డ్ కప్ పై తన ప్రిడిక్షన్ చెప్పుకొచ్చాడు. అందరి కంటే భిన్నంగా తన అభిప్రాయాలను తెలియజేశాడు.

టీ20 వరల్డ్ కప్ పై ఎవరికి వారు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ జాబితాలోకి విండీస్ దిగ్గజ బౌలర్, ప్రముఖ కామెంటేటర్ ఇయాన్ బిషప్ కూడా వచ్చి చేరాడు. అందరి కంటే భిన్నంగా తన ప్రిడిక్షన్ ను చెప్పుకొచ్చాడు బిషప్. ఎక్కువ మంది దిగ్గజ క్రికెటర్లు ఈ టోర్నీలో టీమిండియా స్టార్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ లీడింగ్ వికెట్ టేకర్ గా నిలుస్తాడని చెబితే.. ఇయాన్ బిషప్ మాత్రం చైనా మన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఎక్కువ వికెట్లు తీస్తాడని చెప్పుకొచ్చాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రా ఎక్కువ ప్రభావితం చేస్తాడని పేర్కొన్నాడు.

ఇక ఈ మెగాటోర్నీలో ఎక్కువ పరుగులు చేసింది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బాబర్ అంటూ విశ్లేషకులు చెప్తుంటే.. ఇయాన్ బిషప్ మాత్రం కాస్త వెరైటీగా ఈసారి వరల్డ్ కప్ లో ఎక్కువ రన్స్ చేసేది ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అని చెప్పి, అందరిని ఆశ్చర్యపరిచాడు. సెమీఫైనల్స్ కు ఇండియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేరుతాయని జోస్యం చెప్పాడు. విండీస్ దిగ్గజం చెప్పిన ఈ ప్రిడిక్షన్ క్రికెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇక ఈ మహా సమరం కోసం ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ లో నిమగ్నమైయ్యారు. తమ తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్ తో ఆడనుంది. ఇక ప్రపంచం మెుత్తం ఎదురుచూసే ఇండియా-పాక్ మ్యాచ్ జూన్ 9న జరగనుంది. మరి ఇయన్ బిషప్ ప్రిడిక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి