ఆ రెండు ఓవర్లు మ్యాచ్ ను మలుపు తిప్పాయి! కుల్దీప్ కూ క్రెడిట్ ఇవ్వాల్సిందే..

  • Author Soma Sekhar Updated - 01:08 PM, Mon - 20 November 23

న్యూజిలాండ్ తో మ్యాచ్ లో 7 వికెట్లు తీసి టీమిండియాను గెలిపించాడు మహ్మద్ షమీ. కానీ ఈ మ్యాచ్ ను మలుపు తిప్పింది మాత్రం మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ అనే చెప్పాలి. అతడు వేసిన ఆ రెండు అద్భుత ఓవర్లు మ్యాచ్ ను టర్న్ చేశాయి.

న్యూజిలాండ్ తో మ్యాచ్ లో 7 వికెట్లు తీసి టీమిండియాను గెలిపించాడు మహ్మద్ షమీ. కానీ ఈ మ్యాచ్ ను మలుపు తిప్పింది మాత్రం మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ అనే చెప్పాలి. అతడు వేసిన ఆ రెండు అద్భుత ఓవర్లు మ్యాచ్ ను టర్న్ చేశాయి.

  • Author Soma Sekhar Updated - 01:08 PM, Mon - 20 November 23

న్యూజిలాండ్ ను ఓడించి సగర్వంగా టీమిండియా వరల్డ్ కప్ 2023 ఫైనల్లోకి అడుగుపెట్టింది. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో తొలుత భారత బ్యాటర్లు రెచ్చిపోతే.. ఆ తర్వాత బౌలర్లు దుమ్మురేపారు. అయితే ఒక దశలో టీమిండియా గెలుస్తుందా? ఓడిపోతుందా? అన్న అనుమానం ప్రేక్షకుల్లో కలిగింది. దానికి కారణం డార్లీ మిచెల్, విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్. వీరు ముగ్గురు రన్ రేట్ ను కాపాడుతూ.. కివీస్ ను లక్ష్యం వైపు తీసుకెళ్లారు. కాగా.. చివరి పవర్ ప్లేలో టీమిండియా బౌలర్ కుల్దీప్ వేసిన రెండు ఓవర్లు అద్భుతమనే చెప్పాలి. ఈ ఓవర్లే మ్యాచ్ ను మలుపు తిప్పాయి అంటే మీరు నమ్ముతారా? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

40 ఓవర్లకు 266/4 స్కోర్ తో ఉంది న్యూజిలాండ్. అప్పటికి క్రీజ్ లో డార్లీ మిచెల్ భారీ సెంచరీతో దూకుడుమీదున్నాడు. అతడికి తోడు గ్లెన్ ఫిలిప్స్ నిలకడగా ఆడుతున్నాడు. అయితే 41వ ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోర్ 286కు చేరుకుంది. సిరాజ్ వేసిన ఈ ఓవర్ లో ఫిలిప్స్ రెచ్చిపోయి ఆడాడు. వరుసగా 6,6,4 బాదడంతో 20 పరుగులు ఇచ్చుకున్నాడు సిరాజ్. దీంతో సమీకరణాలు దెబ్బకు దిగొచ్చాయి. ఈ ఓవర్ ముగిశాక 54 బంతుల్లో 112 పరుగులు చేయాల్సి ఉంది కివీస్. ఈ దశలో బౌలింగ్ కు వచ్చాడు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. క్రీజ్ లో సెంచరీ వీరుడు డార్లీ మిచెల్ కిందటి ఓవర్ లో రెచ్చిపోయిన ఫిలిప్స్ ఉండటంతో తీవ్ర ఒత్తిడి ఉంది. కానీ ఈ ఒత్తిడికి ఏ మాత్రం తలొగ్గలేదు కుల్దీప్. కివీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ.. కేవలం 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు.

దీంతో టీమిండియాపై ఉన్న ప్రెజర్ కాస్త.. ప్రత్యర్థిపైకి మళ్లింది. సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువ కావడంతో.. న్యూజిలాండ్ బ్యాటర్లు ఒత్తిడికి లోనైయ్యారు. ఇక తన చివరి ఓవర్ ను కూడా అద్భుతంగా ముగించాడు కుల్దీప్. ఇన్నింగ్స్ 44వ ఓవర్లో కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చి.. ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఈ పరిణామంతో మ్యాచ్ కాస్త టీమిండియా వైపు తిరిగింది. కుల్దీప్ వేసిన ఈ రెండు ఓవర్లలో కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చి.. ప్రత్యర్థిని ప్రెజర్ లోకి నెట్టాడు. కుల్దీప్ ఒత్తిడి కారణంగా బుమ్రాకు 43వ ఓవర్లో వికెట్ సమర్పించుకున్నాడు ఫిలిప్స్. ఇక ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో 7 వికెట్లు తీసి ఆకట్టుకున్న మహ్మద్ షమీతో పాటుగా కుల్దీప్ కు కూడా క్రెడిట్ ఇవ్వాలని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయాపడుతున్నారు. మరి కుల్దీప్ వేసిన ఈ రెండు ఓవర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments