కుల్దీప్ మాయ.. బౌలింగ్ లో కాదు.. బ్యాటింగ్ లో! ఏంటి సామి ఈ మార్పు!

Kuldeep Yadav: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈసారి బౌలింగ్ లో కాదు.. బ్యాటింగ్ లో మాయ చేశాడు. వికెట్ల ప్రవాహాన్ని అడ్డుకున్న తీరు అమోఘం. దీంతో కుల్దీప్ లో ఏంటి ఈ మార్పు అంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Kuldeep Yadav: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈసారి బౌలింగ్ లో కాదు.. బ్యాటింగ్ లో మాయ చేశాడు. వికెట్ల ప్రవాహాన్ని అడ్డుకున్న తీరు అమోఘం. దీంతో కుల్దీప్ లో ఏంటి ఈ మార్పు అంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇంగ్లండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇక కీలకమైన నాలుగో టెస్టులో గెలిచి.. సిరీస్ ను కైవసం చేసుకోవాలనుకున్న టీమిండియాకు ఇంగ్లండ్ ఊహించని షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో రెండోరోజు ఆటముగిసే సమయానికే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి సయమంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాయ చేశాడు. అయితే అతడు చేసిన మాయ బౌలింగ్ లో కాదు.. బ్యాటింగ్ లో. దీంతో ఏంటి ఇంత మార్పు అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కుల్దీప్ యాదవ్.. మణికట్టు మాంత్రికుడిగా ప్రపంచ క్రికెట్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థికి వణుకుపుట్టించడంలో సిద్దహస్తుడు. అలాంటి కుల్దీప్ ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి తీవ్రమైన పరీక్ష పెట్టాడు. మరో రాహుల్ ద్రవిడ్ లా వికెట్లు పడకుండా.. అడ్డుగోడలా నిలబడి బ్యాటింగ్ చేసిన తీరు మెచ్చుకోకుండా ఉండలేం. బ్యాటింగ్ కు దిగిన కుల్దీప్ మెుక్కవోనిదీక్షతో వికెట్లు పడుతున్నా.. నిలబడిన తీరు అమోఘం. ధృవ్ జురెల్ తో కలిసి 8వ వికెట్ కు 202 బంతుల్లో 76 పరుగులు జోడించాడు కుల్దీప్. 131 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. చివరికి అండర్సన్ బౌలింగ్ పెవిలియన్ చేరాడు.

కాగా.. ఇలాంటి ఇన్నింగ్స్ కుల్దీప్ నుంచి ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎప్పుడు బౌలింగ్ తో మాయచేసే కుల్దీప్ ఈసారి బ్యాటింగ్ తో అదరగొట్టాడు. నీ బ్యాటింగ్ లో ఏంటి ఇంత మార్పు అంటూ షాక్ కు గురౌతున్నారు. ఈ మ్యాచ్ టీమిండియా గెలిస్తే మాత్రం కుల్దీప్ కాస్త కింగ్ కుల్దీప్ కావడం ఖాయం. ప్రస్తుతం టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 267 రన్స్ చేసింది. క్రీజ్ లో ధృవ్ జురెల్ అర్దశతకం సాధించి.. టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి కుల్దీప్ అద్భుతమైన బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఆ టీమిండియా ప్లేయర్ వెరీ టాలెంటెడ్.. కానీ ఎక్కువ రన్స్ చేయలేడు: జో రూట్

Show comments