iDreamPost
android-app
ios-app

ఆ టైమ్‌లో రోహిత్‌ చేసిన పనితో సీన్‌ మొత్తం మారిపోయింది: కుల్డీప్‌ యాదవ్‌

  • Published Oct 16, 2023 | 3:54 PM Updated Updated Oct 16, 2023 | 3:54 PM
  • Published Oct 16, 2023 | 3:54 PMUpdated Oct 16, 2023 | 3:54 PM
ఆ టైమ్‌లో రోహిత్‌ చేసిన పనితో సీన్‌ మొత్తం మారిపోయింది: కుల్డీప్‌ యాదవ్‌

ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ వన్‌సైడ్‌గా వెళ్లినా చాలా ఆసక్తికర విశేషాలు చోటు చేసుకున్నాయి. పటిష్టమైన పాకిస్థాన్‌.. టీమిండియాకు టఫ్‌ ఫైట్‌ ఇస్తుందని అంతా అనుకున్నారు కానీ, టీమిండియా సూపర్‌ గేమ్‌తో పాక్‌ను పసికూనను చేసి ఓ ఆట ఆడుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాస్టర్‌ మైండ్‌ గురించి కూడా మాట్లాడుకోవాలి. పాకిస్థాన్‌కు మంచి స్టార్ట్‌ లభించిన తర్వాత అద్భుతంగా బౌలింగ్‌ మార్పులు చేసి.. పాకిస్థాన్‌ను ఘోరంగా దెబ్బ కొట్టాడు. తొలి మూడు ఓవర్లలో సిరాజ్‌ భారీగా పరుగులు ఇచ్చినా కూడా.. అతనిపై నమ్మకం పెట్టి.. స్పెల్‌ కొనసాగించాడు. వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌ అయిన సిరాజ్‌ కాస్త ఎక్స్‌పెన్సీవ్‌గా ప్రూవ్‌ అయినా కూడా తొలి వికెట్‌ అందించాడు.

ఆ తర్వాత బాబర్‌ అజమ్‌-రిజ్వాన్‌ జోడీ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో కూడా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరోసారి సిరాజ్‌ను రెండో స్పెల్‌ కోసం తీసుకొచ్చి ఫలితం రాబట్టాడు. 50 పరుగులు చేసి మంచి ఊపుమీదున్న పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ను సిరాజ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేసి.. పాక్‌ను చావుదెబ్బకొట్టాడు. అయితే.. ఇక్కడే కెప్టెన్‌ రోహిత్‌ తన కెప్టెన్సీ మార్క్‌ చూపించాడు. బాబర్‌ వికెట్‌ కోల్పోయి డీలా పడిన పాక్‌ను మళ్లీ కోలుకుండా చేయాలంటే.. వెంటనే మరో వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌తో ఎటాక్‌ చేయాలి. సరిగ్గా రోహిత్‌ శర్మ అదే చేశాడు. కుల్డీప్‌ యాదవ్‌తో స్పెల్‌ కొనసాగించాడు. అది అద్భుత ఫలితం ఇచ్చింది.

ఇదే విషయం గురించి కుల్దీప్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘నాతో ఆ ఓవర్‌ రోహిత్‌ అన్ననే వేయించాడు. నన్ను మరో ఎక్స్‌ట్రా ఓవర్‌ వేయాల్సిందిగా రోహిత్‌ భాయ్‌ సూచించాడు. అది గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. ఆ ఓవర్‌లో ఏకంగా రెండు ఓవర్లు పడ్డాయి. దీంతో పాకిస్థాన్‌ కోలుకోలేకపోయింది. అంతకంటే ముందు ఓవర్‌లో సిరాజ్‌.. బాబర్‌ అజమ్‌ను అవుట్‌ చేయడం, నేను వేసిన తర్వాత ఓవర్‌లో రెండు వికెట్ల పడిపోయాయి. ఇదంతా రోహిత్‌ భాయ్‌ కెప్టెన్సీ ఫలితమే’ అంటూ చెప్పుకొచ్చాడు కుల్డీప్‌ యాదవ్‌. అయితే.. టీమిండియాలో ఎంత గొప్ప బౌలర్లు ఉన్నా.. సరైన సమయంలో బౌలింగ్‌ మార్పులు చేస్తూ.. వారి నుంచి ది బెస్ట్‌ బయటకు తేవాలంటే అది కెప్టెన్‌ వల్లే అవుతుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: తీవ్ర దుఃఖంలో ఉన్న మాకు.. ఈ విజయం కాస్త సంతోషాన్నిచ్చింది: రషీద్‌ ఖాన్‌