Nidhan
Kuldeep Yadav Fails In The Duleep Trophy 2024: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌కు వస్తున్నాడంటే ప్రత్యర్థి జట్లు వణికిపోతాయి. ఎక్కడ తమను కుప్పకూలుస్తాడోనని భయపడతాయి. అంతలా అంతర్జాతీయ క్రికెట్ మీద తనదైన ముద్ర వేశాడీ చైనామన్ బౌలర్.
Kuldeep Yadav Fails In The Duleep Trophy 2024: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌కు వస్తున్నాడంటే ప్రత్యర్థి జట్లు వణికిపోతాయి. ఎక్కడ తమను కుప్పకూలుస్తాడోనని భయపడతాయి. అంతలా అంతర్జాతీయ క్రికెట్ మీద తనదైన ముద్ర వేశాడీ చైనామన్ బౌలర్.
Nidhan
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌కు వస్తున్నాడంటే ప్రత్యర్థి జట్లు వణికిపోతాయి. ఎక్కడ తమను కుప్పకూలుస్తాడోనని భయపడతాయి. అంతలా అంతర్జాతీయ క్రికెట్ మీద తనదైన ముద్ర వేశాడీ చైనామన్ బౌలర్. తోపు బ్యాటర్లను కూడా తన స్పిన్ మ్యాజిక్‌తో ముప్పుతిప్పలు పెడుతూ సంచలన ప్రదర్శనలతో చెలరేగుతున్నాడు. అలాంటోడు దేశవాళీ క్రికెట్‌లో మాత్రం దారుణంగా తేలిపోయాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా ఏ తరఫున బరిలోకి దిగిన ఈ స్పిన్నర్ అంచనాలను అందుకోలేకపోయాడు. కుర్ర బ్యాటర్లను కూడా ఔట్ చేయలేక తుస్సుమన్నాడు. అసలు బౌలింగ్ చేస్తోంది కుల్దీపేనా అనే డౌట్స్ వచ్చేలా అతడి స్పెల్ సాగింది. 14 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
సెంచరీతో చెలరేగిన యంగ్ బ్యాటర్ ముషీర్ ఖాన్ (105 నాటౌట్)ను ఆపడంలో కుల్దీప్ ఫెయిల్ అయ్యాడు. ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్ లాంటి ఇతర బౌలర్లు ఒక ఎండ్‌లో వస్తున్న బ్యాటర్‌ను వస్తున్నట్లే పెవిలియన్‌కు పంపించసాగారు. కానీ మరో ఎండ్‌లో ముషీర్ క్రీజులో పాతుకుపోయాడు. స్కోరు బోర్డు మీదకు ఒక్కో రన్ చేరుస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించసాగాడు. అతడికి నవ్‌దీప్ సైనీ (74 బంతుల్లో 29 నాటౌట్) మంచి సహకారం అందించాడు. వికెట్లు పడకపోవడం, పేసర్లను ఈ ఇద్దరూ సమర్థంగా ఎదుర్కోవడంతో ఇండియా ఏ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పిన్నర్ కుల్దీప్ను రంగంలోకి దింపాడు. కానీ కుల్దీప్ను ముషీర్-సైనీ అలవోకగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ముషీర్ అతడి బౌలింగ్‌లో భారీగా పరుగులు పిండుకున్నాడు. వికెట్లు తీస్తాడనుకుంటే కుల్దీప్ ఆ పని చేయకపోగా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 14 ఓవర్లు వేసిన ఈ చైనామన్ బౌలర్ 50 పరుగులు ఇచ్చుకున్నాడు.
అటు పేసర్లు, ఇటు స్పిన్నర్ కుల్దీప్ ఫెయిల్ అవడంతో ఇండియా ఏ వికెట్లు తీయలేక సతమతమైంది. బౌలర్లను బాదిపారేసిన ముషీర్-సైనీ జోడీ కలసి ఎనిమిదో వికెట్‌కు 106 పరుగులు జోడించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసేసరికి ఇండియా బీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 202 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ ఎంత సేపు క్రీజులో ఉంటారనే దాని మీదే ఆ టీమ్ భారీ స్కోరు ఆశలు ఆధారపడి ఉన్నాయి. ముషీర్ జోరు చూస్తుంటే కనీసం 150 పరుగులు చేసేలా ఉన్నాడు. అయితే సైనీ సపోర్ట్ అతడికి అవసరం. మరోవైపు ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయిన గిల్ సేన.. రేపు మార్నింగ్ సెషన్లోనే వాళ్ల కథ ముగించాలని అనుకుంటోంది. అయితే ఇతర బౌలర్లతో పాటు కుల్దీప్ కూడా రాణిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇక, వన్డేలు, టీ20ల్లో టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్‌గా మారిన కుల్దీప్.. టెస్టుల్లో పర్మినెంట్ ప్లేస్ ఫిక్స్ చేసుకోలేదు. అశ్విన్, అక్షర్, జడేజా లాంటి క్వాలిటీ స్పిన్ ఆల్‌రౌండర్స్‌ను దాటి అతడు జట్టులో ఉండాలంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. కానీ దులీప్ ట్రోఫీ ఓపెనర్‌లోనే అతడు నిరాశపర్చాడు. మరి.. కుల్దీప్ ఫెయిల్యూర్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.