Somesekhar
టీమిండియా స్టార్ బౌలర్ కుల్దీప్ యాదవ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్ బ్యాటర్లు అతడిని చూసి సిగ్గుపడాలి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కారణం ఏంటేంటే?
టీమిండియా స్టార్ బౌలర్ కుల్దీప్ యాదవ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్ బ్యాటర్లు అతడిని చూసి సిగ్గుపడాలి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కారణం ఏంటేంటే?
Somesekhar
ఇంగ్లండ్ పై టీమిండియా జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 3-1తో కైవసం చేసుకున్న భారత్.. చివరి మ్యాచ్ లోనూ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో యువ బ్యాటర్లతో పాటుగా అరంగేట్ర ప్లేయర్లు సత్తాచాటారు. దీంతో భవిష్యత్ లో టీమిండియాకు తిరుగులేదని భరోసా ఇస్తున్నారు ఆ యువ ఆటగాళ్లు. యశస్వీ జైస్వాల్, శుబ్ మన్ గిల్, దేవ్ దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి యంగ్ ప్లేయర్లు ఇంగ్లండ్ ను ఓ ఆటాడుకుంటున్నారు. ఇక ఈ సిరీస్ లో బౌలింగ్ తో పాటుగా బ్యాటింగ్ లోనూ అదరగొడుతున్నాడు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.
కుల్దీప్ యాదవ్.. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో హాట్ టాపిక్ గా మారిన ప్లేయర్. దానికి కారణం బౌలింగ్ కాదు.. బ్యాటింగ్. సాధారణంగా బౌలర్లకు బ్యాటింగ్ సరిగ్గా చేయడం రాదనే అపవాదు ఉంది. దాన్ని చెరిపేస్తూ.. గత రెండు టెస్ట్ ల్లో అద్భుతమైన డిఫెన్స్ తో అలరిస్తున్నాడు కుల్దీప్. నాలుగో టెస్ట్ లో వికెట్లు పడుతుంటే.. వందకుపైగా బంతులు ఎదుర్కొని కీలకమైన రన్స్ చేశాడు. ఇక అదే బ్యాటింగ్ ఫామ్ ను చివరి టెస్ట్ లో కూడా కొనసాగించాడు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 69 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. బౌలింగ్ తో పాటుగా బ్యాటింగ్ లోనూ అలరిస్తున్నాడు. అద్భుతమైన డిఫెన్స్ తో ప్రధానమైన బ్యాటర్లకు దీటుగా బంతుల్ని ఎదుర్కొంటున్నాడు.
ఈ సిరీస్ లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు అయిన కెప్టెన్ బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు కుల్దీప్. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు స్టోక్స్ 357 బంతులు, బెయిర్ స్టో 259 బాల్స్ ఎదుర్కొన్నారు. కానీ వీళ్లిద్దరి కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్నాడు కుల్దీప్ యాదవ్. అతడు ఆరు ఇన్నింగ్స్ ల్లో 362 బాల్స్ ఫేస్ చేశాడు. దీంతో క్రికెట్ లవర్స్ కుల్దీప్ బ్యాటింగ్ పై పొగడ్తలు కురిపిస్తున్నారు. నీ బ్యాటింగ్ చూసి ఇంగ్లండ్ బ్యాటర్లు సిగ్గు తెచ్చుకోవాలి. హ్యాట్సాఫ్ కుల్దీప్ యాదవ్.. అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో 195 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 64 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇక ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జో రూట్ 72, షోయబ్ బషీర్ 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరి ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లకు దీటుగా బ్యాటింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: వీడియో: కుర్రాళ్లను గెలికిన బెయిర్ స్టో! ఒక్క మాటతో పరువుతీసిన గిల్