SNP
KS Bharat, India vs England: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్‌లో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్, మన తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ మంచి ప్రదర్శనతో ఆకట్టుకన్నాడు. కానీ, అంపైర్స్ కాల్ తని కొంపముంచింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
KS Bharat, India vs England: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్‌లో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్, మన తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ మంచి ప్రదర్శనతో ఆకట్టుకన్నాడు. కానీ, అంపైర్స్ కాల్ తని కొంపముంచింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు కేవలం 246 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇండియాపై బజ్‌బాల్ స్ట్రాటజీని ప్రయోగిస్తామని చెప్పిన ఇంగ్లండ్.. మన స్పిన్ మాయాజాలం ముందు తలొంచింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్.. ఈ త్రిమూర్తులు బాల్‌ను గింగిరాలు తిప్పుతుంటే.. ఇంగ్లండ్ ఆటగాళ్ల కళ్లు బైర్లుకమ్మాయి. ఒక్క బెన్‌స్టోక్స్ మినహా ఇతర బ్యాటర్లంతా దారుణంగా విఫలం అయ్యారు.
ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా.. ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఓపెనర్ జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. జడేజా సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. వీరిలో పాటు మన తెలుగు కుర్రాడు, కేఎస్ భరత్ సైతం మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన భరత్.. 81 బంతుల్లో 3 ఫోర్లతో 41 పరుగులు చేసి.. అంపైర్ కాల్ కారణంగా అవుట్ అయ్యాడు. జో రూట్ వేసిన ఇన్నింగ్స్ 89వ ఓవర్‌లో తొలి బంతికే అద్భుతమైన షాట్‌తో బౌండరీ బాదిన భరత్.. తర్వాతి బంతికి కూడా షాట్ కోసం ప్రయత్నించాడు. కానీ, ఈ సారి బాల్ మిస్ అయ్యాడు. అదొచ్చి అతన థైప్యాడ్‌కు తాకింది.
మొకాళ్లపై కూర్చొని షాట్ ఆడటంతో తక్కువ ఎత్తులో వచ్చిన బాల్ థైప్యాడ్‌కు తాకింది. దీంతో అంపైర్ లెగ్ బిఫోర్ అవుట్‌గా ప్రకటించాడు. దానికి భరత్ రివ్యూ కోరాడు. రివ్యూలో బాల్ ఆఫ్ స్టంప్ అవుట్ సైడ్ తాకుతుండటంతో దాన్ని అంపైర్స్ కాల్‌గా పరిగణించి భరత్‌ను థర్డ్ అంపైర్‌గా అవుట్‌గా ప్రకటించాడు. దీంతో.. భరత్ చాలా నిరాశగా గ్రౌండ్ వీడాల్సి వచ్చింది. అదే అంపైర్ నాటౌట్ ఇచ్చి ఉంటే.. అంపైర్స్ రూపంలో భరత్ నాటౌట్‌గానే ఉండేవాడు. ఇలా అంపైర్స్ కాల్ కారణంగా భరత్ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. లేకుంటే.. మంచిగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకునే వాడు. ఏది ఏమైనా.. అంపైర్స్ కాల్ కారణంగా అవుట్ అయితే ఆ బాధ మాటల్లో చెప్పలేం. పైగా భారత్‌కు చాలా కాలం తర్వాత మళ్లీ తనను తాను నిరూపించే అవకాశం వచ్చింది. కానీ, దానిపై అంపైర్ నీళ్లు చల్లాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
KS Bharat misses out on his maiden Test fifty as Joe Root gets him for 41 runs. pic.twitter.com/OWvrmPb4jV
— CricketGully (@thecricketgully) January 26, 2024