విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్.. గత ఐపీఎల్ సీజన్ నుంచి వరల్డ్ క్రికెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు. దానికి కారణం ఐపీఎల్ లో వీరిద్దరికి మధ్య జరిగిన వివాదమే. ఈ గొడవతో నవీన్ ఉల్ హక్ ను ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు విరాట్ ఫ్యాన్స్. ఎక్కడ మ్యాచ్ జరిగినా నవీన్ ఉల్ హక్ కనపడితే చాలు.. కోహ్లీ, కోహ్లీ అంటూ అరుస్తూ.. ఆటపట్టిస్తున్నారు. అయితే ఇది గతం. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ నవీన్ కు అండగా నిలుస్తున్నారు. దానికి కారణం ఇటీవల జరిగిన ఇండియా-ఆఫ్గాన్ మ్యాచే. ఈ మ్యాచ్ విరాట్-నవీన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో పాటు హగ్ కూడా చేసుకుని తామిద్దరం మంచి ఫ్రెండ్స్ గా కలిసిపోయాం అని హింట్ ఇచ్చారు. దీని ఎఫెక్ట్ తాజాగా జరిగిన ఇంగ్లాండ్-ఆఫ్గాన్ మ్యాచ్ లో కనిపించింది. ఈ పరిణామాన్ని నవీన్ ఊహించి ఉండడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇంగ్లాండ్ కు భారీ షాక్ ఇస్తూ.. ఆఫ్గాన్ 69 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెసిందే. ఇక ఈ మ్యాచ్ లో పసికూన ఆఫ్గాన్ అనూహ్యరీతిలో చెలరేగి డిఫెండింగ్ ఛాంపియన్ ను కంగుతినిపించింది. ఇక్కడి వరకు అందరికి ఇది తెలిసిన విషయమే. కానీ ఈ మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. ఇటీవల ఇండియాతో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గాన్ పేసర్, మ్యాంగో మ్యాన్ నవీన్ ఉల్ హక్-విరాట్ కోహ్లీ గొడవ మరిచి మంచి ఫ్రెండ్స్ గా మారిన సంగతి తెలియనిది కాదు. దీంతో విరాట్ ఫ్యాన్స్ సైతం నవీన్ ను క్షమించి అతడికి అండగా నిలవడం స్టార్ట్ చేశారు.
తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో నవీన్ ఉల్ హక్ ఓ అద్భుతమైన డెలివరితో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్(9)ను పెవిలియన్ కు పంపాడు. దీంతో స్టేడియం ఒక్కసారిగా నవీన్.. నవీన్.. నవీన్ అంటూ మారుమ్రోగిపోయింది. ఇక ఈ రెస్పాన్స్ ను ఊహించలేకపోయాడు నవీన్ ఉల్ హక్. ఇంతకు ముందు నవీన్ గ్రౌండ్ లో ఉంటే.. కోహ్లీ, కోహ్లీ అని అరిచి అతడిని ట్రోల్ చేసేవారు విరాట్ ఫ్యాన్స్. కానీ విరాట్ కోహ్లీతో ఎప్పుడైతే దోస్తాన్ చేయడం ప్రారంభించాడో నవీన్ కు కోహ్లీ ఫ్యాన్స్ మద్దతు లభించడం స్టార్ట్ అయ్యింది. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడంతో.. కోహ్లీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ తో దోస్తాన్ అంటే అలా ఉంటది నవీన్ భాయ్.. ఈ క్రేజ్ నువ్వు ఊహించలేదు కదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మా మద్దతు నీకెప్పుడూ ఉంటుంది అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.
Delhi is cheering for Naveen. Yes, read that again! 👏👏👏pic.twitter.com/e8wyN4zxz7
— Lucknow Super Giants (@LucknowIPL) October 15, 2023
Virat Kohli 🤝 Naveen Ul Haq.
This is why cricket is more than a game. pic.twitter.com/5n3QQevYXy
— Johns. (@CricCrazyJohns) October 11, 2023