SNP
SNP
ఆసియా కప్ 2023లో భారత్ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు మిడిల్డార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండటం లేదంటూ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ప్రకటించాడు. మరో మూడో రోజుల్లో మ్యాచ్ పెట్టుకుని.. ద్రావిడ్ ఈ ప్రకటన చేయడం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. కాగా, రేపు(బుధవారం) ముల్తాన్ వేదికగా జరిగే పాకిస్థాన్-నేపాల్ మ్యాచ్‌తో ఆసియా కప్ 2023 ప్రారంభం కానుంది. ఈ టోర్నీని పాకిస్థాన్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో పల్లెకెలె స్టేడియంలో ఆడనుంది.
ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారత్ ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగుతుందో కూడా అంతా ఒక అంచనాకు వచ్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్.. గాయం నుంచి చాలా వేగంగా కోలుకుంటున్నాడని, అయితే.. అతను పాకిస్థాన్, నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడంటూ కోచ్ ద్రావిడ్ ప్రకటించాడు. దీంతో రాహుల్ ఇంకా గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకోలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
అయితే.. ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకుంటే రాహుల్ స్థానంలో మిడిల్డార్‌లో ఆడిస్తారా? లేక శుబ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టి ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడించి, అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకుని అతన్ని మిడిల్డార్‌లో ఆడిస్తానే అనేది చూడాలి. ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ టీమ్‌లో ఉంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు టీమ్‌లో ఉంటారు. జడేజాతో కలుపుకుని ముగ్గురు ఉంటారు. ఇది టీమ్‌ను పటిష్టం చేస్తోంది. షాహీన్ షా అఫ్రిదీ లాంటి డేంజరస్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఉన్న పాకిస్థాన్ లాంటి టీమ్‌ను ఓడించాలంటే జట్టులో లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే మంచిదే. అయితే.. గిల్‌ను కూడా ఆడిస్తే.. అక్షర్ పటేల్‌కు తుది జట్టులో చోటు దక్కపోవచ్చు. అయితే.. గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే కేఎల్ రాహుల్‌ను అసలు ఎలా ఎంపిక చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతని స్థానంలో సంజు శాంసన్‌ను ఎంపిక చేసినా బాగుండేదని అంటున్నారు క్రికెట్ అభిమానులు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
UPDATE
KL Rahul is progressing really well but will not be available for India’s first two matches – against Pakistan and Nepal – of the #AsiaCup2023: Head Coach Rahul Dravid#TeamIndia
— BCCI (@BCCI) August 29, 2023
ఇదీ చదవండి: వాళ్ల ముగ్గురితో మాట్లాడుతున్నా.. వన్డేల్లో కూడా ఇరగదీస్తా: SKY