iDreamPost
android-app
ios-app

లండన్ కు స్టార్ క్రికెటర్.. ఐదో టెస్ట్ కు దూరం! కారణం ఇదే!

  • Published Feb 28, 2024 | 2:27 PM Updated Updated Feb 28, 2024 | 2:27 PM

టీమిండియా స్టార్ క్రికెటర్ లండన్ కు వెళ్తున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలే మహ్మద్ షమీకి లండన్ లో సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్లేయర్ కూడా లండన్ వెళ్తుండటంతో.. ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి ఆ ప్లేయర్ ఎవరు?

టీమిండియా స్టార్ క్రికెటర్ లండన్ కు వెళ్తున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలే మహ్మద్ షమీకి లండన్ లో సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్లేయర్ కూడా లండన్ వెళ్తుండటంతో.. ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి ఆ ప్లేయర్ ఎవరు?

లండన్ కు స్టార్ క్రికెటర్.. ఐదో టెస్ట్ కు దూరం! కారణం ఇదే!

ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభమైన తర్వాత టీమిండియా ప్లేయర్లు వరుసగా గాయాలబారిన పడ్డారు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్ గాయాలతో కొన్ని టెస్ట్ లకు దూరమైయ్యారు. అయితే షమీ వరల్డ్ కప్ గాయంతో ఈ సిరీస్ కు పూర్తిగా దూరమవుతాడన్న సంగతి ముందే తెలుసు. తాజాగా షమీ తన కాలికి సక్సెస్ ఫుల్ గా సర్జరీ చేయించుకున్నాడు. లండన్ లో ఈ ఆపరేషన్ జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక తాజాగా మరో స్టార్ ప్లేయర్ కూడా లండన్ పయనమవుతున్నాడు.

టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లండన్ వెళ్లనున్నాడు. గాయం కారణంగా ఇంగ్లండ్ తో జరిగిన మూడు, నాలుగవ టెస్ట్ మ్యాచ్ లకు దూరమైయ్యాడు. అయితే అతడు తొడకండరాల నొప్పితో బాధపడుతున్నాడు. ఆ గాయం నుంచి రాహుల్ పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ..”గత మూడు టెస్టులకు రాహుల్ అందుబాటులో ఉంటాడనే అనుకున్నాం. కానీ అతడి గాయం ఇంకా మానకపోవడం, తాను తీవ్రంగా అసౌకర్యానికి గురవుతున్నాని చెప్పడంతో.. అతడిని లండన్ చికిత్స కోసం పంపిస్తున్నాం” అని పేర్కొన్నారు.

అయితే రాహుల్ కు అయిన గాయం పెద్దది అయితే, సర్జరీ చేయాల్సి వస్తే.. ఐపీఎల్ 2024తో సహా, జూన్ లో ప్రారంభమైయ్యే టీ20 వరల్డ్ కప్ కు కూడా దూరమైయ్యే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. దీంతో ఇంగ్లండ్ తో జరిగే చివరి టెస్ట్ కు కూడా రాహుల్ అందుబాటులో ఉండడం లేదన్నమాట. కాగా.. ఇరు జట్ల మధ్య నామమాత్రపు ఐదవ టెస్ట్ మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది. సిరీస్ గెలవడంతో.. రోహిత్ శర్మ సైతం రెస్ట్ తీసుకుని, కెప్టెన్సీ పగ్గాలను రవిచంద్రన్ అశ్విన్ కు అప్పగిస్తారన్న న్యూస్ కూడా వైరల్ గా మారింది.

ఇదికూడా చదవండి: కోచ్ తో రోహిత్ ఛాలెంజ్! చెప్పింది చేసి చూపించిన మొనగాడు!