SNP
KL Rahul, KKR vs LSG, IPL 2024: కేకేఆర్ వర్సెస్ ఎల్‌ఎస్‌జీ మ్యాచ్‌లో.. కేఎల్ రాహుల్ హీరోగా మారాడు. తన టీమ్ దారుణంగా ఓడిపోయినప్పటికీ.. రాహుల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
KL Rahul, KKR vs LSG, IPL 2024: కేకేఆర్ వర్సెస్ ఎల్‌ఎస్‌జీ మ్యాచ్‌లో.. కేఎల్ రాహుల్ హీరోగా మారాడు. తన టీమ్ దారుణంగా ఓడిపోయినప్పటికీ.. రాహుల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. ఆదివారం డబుల్ హెడ్డర్‌లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఏకంగా 98 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న కేకేఆర్.. ఫ్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపు కన్ఫామ్ చేసుకుంది. అయితే.. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం హీరోగా మారాడు. ఈ మ్యాచ్‌లో అతను పట్టిన ఓ సెన్సెషనల్ క్యాచ్.. మొత్తం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆ క్యాచ్ చూస్తే.. ఇంత మంచి వికెట్ కీపర్‌ను టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024లో మిస్ అవుతుందా అని అనిపించకమానదు.
కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో కేఎల్ రాహుల్ ఈ సూపర్ క్యాచ్‌ను అందుకున్నాడు. యశ్ ఠాకూర్ వేసిన ఆ ఓవర్ మూడో బంతిని కేకేఆర్ కెప్టెన్ లెగ్ సైడ్ ఆడదాం అనుకున్నాడు. కానీ, బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకున్న బంతి.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు ఎడమ వైపు చాలా దూరంగా వెళ్లింది. దాన్ని అమాంతం గాల్లోకి ఒక సూపర్ మ్యాన్‌లా దూకి రాహుల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్‌ను చూసి.. శ్రేయస్ అయ్యర్ షాక్ అయ్యాడు. ఇంత సూపర్ క్యాచ్ పట్టినా.. అప్పటికే కేకేఆర్ భారీ స్కోర్ చేసేసింది. పైగా.. ఈ మ్యాచ్‌లో లక్నో ఏకంగా 98 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కేఎల్ రాహుల్ పడిన కష్టానికి ఫలితం లేకుండా పోయింది. ఈ ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలు క్లిష్టంగా మారాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు సాల్ట్ 32, సునీల్ నరైన్ 81 పరుగులతో రాణించారు. నరైన్ అయితే కేవలం 39 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్సులతో రెచ్చిపోయి ఆడాడు. అలాగే రఘువంశీ 32, శ్రేయస్ అయ్యర్ 23, రమన్‌దీప్ సింగ్ 6 బంతుల్లో 25 రన్స్ చేసి కేకేఆర్ భారీ స్కోర్ చేయడంలో సాయపడ్డారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక 236 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగి ఎల్‌ఎస్‌జీ 16.1 ఓవర్లలో కేవలం 137 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 25, స్టోయినీస్ 36 తప్పా.. మిగతా బ్యాటర్లంతా విఫలం అవ్వడంతో లక్నో చిత్తుగా ఓడిపోయింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, వరణ్ చక్రవర్తి 3, ఆండ్రీ రస్సెల్ 2, స్టార్క్, నరైన్ చెరో వికెట్లతో రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో రమన్ దీప్ సింగ్ పట్టిన సెన్సెషనల్ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
KL RAHUL TOOK A STUNNER. 🔥 pic.twitter.com/hM0mVr22SA
— Johns. (@CricCrazyJohns) May 5, 2024