VIDEO: ఇండోర్‌ నుంచి ఔట్‌డోర్‌కు! KL రాహుల్‌ కొడితే ఇలా ఉంటుంది

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఇండోర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. ఏకంగా 399 పరుగులు భారీ స్కోర్‌ సాధించింది. యువ క్రికెటర్లు శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీలతో చెలరేగడంతో పాటు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ హాఫ్‌ సెంచరీతలో రాణించడంతో భారత్‌కు భారీ స్కోర్‌ దక్కింది. టీమిండియా ఇన్నింగ్స్‌ తర్వాత.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో.. టార్గెట్‌ను 33 ఓవర్లలో 317 పరుగులకు కుదించారు. ఈ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఎటాకింగ్‌ గేమ్‌ ఆడిన ఆసీస్‌ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.

అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కొట్టిన ఓ భారీ సిక్స్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరున్‌ గ్రీన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 35వ ఓవర్‌లోని మూడో బంతిని రాహుల్‌.. మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌ కొట్టాడు. ఆ షాట్‌ను రాహుల్‌ టైమ్‌ చేసిన తీరు అద్భుతమని చెప్పాలి. ఎంత చక్కగా కొట్టాడంటా ఆ షాట్‌ను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. పైగా ఆ భారీ సిక్స్‌ ఏకంగా గ్రౌండ్‌ టాప్‌ రూఫ్‌పై పడి గ్రౌండ్‌ బయటికి వెళ్లిపోయింది. ఆ సిక్స్‌ దాదాపు 90 మీటర్లపైనే దూరం వెళ్లింది. కాగా, మ్యాచ్‌కి ముందు రాహుల్‌.. ఇండోర్‌ స్టేడియం రూఫ్‌పై ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానెల్స్‌ను ప్రారంభించాడు. మ్యాచ్‌లో మాత్రం ఆ సిక్స్‌ భారీ సిక్స్‌తో ఆ ప్యానెల్స్‌ను డ్యామెజ్‌ చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 8 పరుగులకే అవుటైనా.. మరో ఓపెనర్‌ గిల్‌తో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుతమైన భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ ఇద్దరు సెంచరీలో చేశారు. అయ్యర్‌ 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులతో 105 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. ఇక గిల్‌ 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 104 రన్స్‌ చేశాడు. ఇక రాహుల్‌ 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 52, ఇషాన్‌ 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 31 రన్స్‌ చేశారు.

మిస్టర్‌ 360 సూర్య కుమార్‌ యాదవ్‌ తన హిట్టింగ్‌ పవర్‌నుచూసిస్తూ.. 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 72 పరుగులతో దుమ్మరేపాడు. జడేజా 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 33 ఓవర్లలో 317 రన్స్‌ ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ 28.2 ఓవర్లో 217 రన్స్‌కు ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ బ్యాటర్లలో డేవిడ్‌ వార్నర్‌ 53, అబాట్‌ 52 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్‌, జడజా మూడేసి వికెట్లు పడగొట్టారు. షమీ ఒకటి, ప్రసిద్ధ్‌ కృష్ణ రెండు వికెట్లు తీసుకున్నారు. శార్దుల్‌ ఠాకూర్‌కు వికెట్‌ దక్కలేదు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయంతో పాటు, కేఎల్‌ కొట్టిన భారీ సిక్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 4 నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్న పాక్‌ క్రికెటర్లు! వరల్డ్‌ కప్‌ ముందు..

Show comments