వీడియో: విరాట్‌ కోహ్లీ ఫీల్డింగ్‌ చూసి.. షాకైన టీమిండియా స్టార్‌ క్రికెటర్లు!

Virat Kohli, KL Rahul, Shubman Gill, IND vs BAN: ప్రపంచ క్రికెట్‌లోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఫీల్డర్‌గా ఉన్న విరాట్‌ కోహ్లీ.. ఫీల్డింగ్‌తో ఇద్దరు స్టార్‌ క్రికెటర్లను షాక్‌కి గురి చేశాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Virat Kohli, KL Rahul, Shubman Gill, IND vs BAN: ప్రపంచ క్రికెట్‌లోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఫీల్డర్‌గా ఉన్న విరాట్‌ కోహ్లీ.. ఫీల్డింగ్‌తో ఇద్దరు స్టార్‌ క్రికెటర్లను షాక్‌కి గురి చేశాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఎంత గొప్ప బ్యాటరో అంతకంటే అద్భుతమైన ఫీల్డర్‌ కూడా. అతని ఫీల్డింగ్‌ విన్యాసాలను చాలా ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం టీమిండియాలో మోస్ట్‌ సీనియర్‌ ప్లేయర్‌ అయిన కోహ్లీ.. ఫీల్డింగ్‌లో యంగ్‌ ప్లేయర్‌ కంటే ఎంతో మెరుగ్గా ఉంటాడు. తన ఫీల్డింగ్‌తో యంగ్‌ క్రికెటర్లలో ఉత్సాహం నింపుతూ.. వారికి సవాలు విసురుతుంటాడు. ప్రపంచంలోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఫీల్డింగ్‌గా కొనసాగుతున్న కోహ్లీ.. తాజాగా టీమిండియా ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో కూడా అద్భుతమైన ఫీట్లతో అదరగొట్టాడు.

కోహ్లీ ఫీల్డింగ్‌ చూసి.. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు కేఎల్‌ రాహుల్‌, యంగ్‌ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ సైతం ఆశ్చర్యపోయారు. ఇతనేంటి మరీ ఇలా చేసేస్తున్నాడంటూ.. హ్యాపీ ఫేసులు పెట్టారు. కోహ్లీ బాల్‌ అందుకునేందుకు డైవ్‌ చేస్తున్న క్రమంలో వెనుక నిలబడి రాహుల్‌, గిల్‌ అబ్జర్వ్‌ చేస్తూ.. వావ్‌ అంటూ మెచ్చుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ సూపర్‌ ఫీల్డింగ్‌కు, కేఎల్‌ రాహుల్‌, గిల్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లు వైరల్‌గా మారాయి. కోహ్లీ లాంటి కిరాక్‌ ఫీల్డర్‌ ఫీల్డింగ్‌ చూసి.. ఈ స్టార్‌ క్రికెటర్లు ఆశ్చర్యపోవడంలో విశేషం ఏం లేదని.. హేమాహేమీలే కోహ్లీ ఫీల్డింగ్‌కి ఫిదా అయిపోతారని క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.

కాగా, ఈ ప్రాక్టీస్‌ సెషన్‌ బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌ కోసం నిర్వహించారు. ఈ నెల 19(గురువారం) నుంచి చెన్నైలోని చిదంబరం క్రికెట్‌ స్టేడియం వేదికగా భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్‌ జట్టు భారత పర్యటనకు వచ్చింది. టీమిండియా చాలా గ్యాప్‌ తర్వాత టెస్ట్‌ సిరీస్‌ బరిలోకి దిగనుండగా.. మరోవైపు బంగ్లాదేశ్‌ మాత్రం.. పాకిస్థాన్‌ను వాళ్ల దేశంలోనే వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఓడించి రెట్టించిన ఉత్సాహంతో టెస్ట్‌ సిరీస్‌ సమరానికి సిద్ధం అవుతోంది. పాక్‌కు షాకిచ్చినట్లే.. టీమిండియాకు కూడా ఇవ్వాలని భావిస్తోంది బ​ంగ్లా జట్టు. మరి భారత్‌-బంగ్లా టెస్ట్‌ సిరీస్‌తో పాటు.. ప్రాక్టీస్‌ సెషన్‌లో కోహ్ల ఫీల్డింగ్‌, కేఎల్‌ రాహుల్‌, గిల్‌ ఇచ్చిన రియాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments