iDreamPost
android-app
ios-app

KL Rahul: ఈ సీజన్ మెుత్తం మాకు అదే సమస్య.. ఓటములపై నోరువిప్పిన కేఎల్ రాహుల్!

  • Published May 15, 2024 | 11:41 AM Updated Updated May 15, 2024 | 11:41 AM

ఈ సీజన్ మెుత్తం మాకు ఒకే సమస్య ఎదురైందని, దాన్ని వల్లే ఓడిపోయామని వైఫల్యానికి కారణం చెప్పుకొచ్చాడు లక్నో కెప్టెన్ KL రాహుల్. ఆ వివరాల్లోకి వెళితే..

ఈ సీజన్ మెుత్తం మాకు ఒకే సమస్య ఎదురైందని, దాన్ని వల్లే ఓడిపోయామని వైఫల్యానికి కారణం చెప్పుకొచ్చాడు లక్నో కెప్టెన్ KL రాహుల్. ఆ వివరాల్లోకి వెళితే..

KL Rahul: ఈ సీజన్ మెుత్తం మాకు అదే సమస్య.. ఓటములపై నోరువిప్పిన కేఎల్ రాహుల్!

ఐపీఎల్ 2024 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కథ దాదాపుగా ముగిసినట్లే. టోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో ప్లే ఆఫ్స్ ఆశలను ఇంకా క్లిష్టతరం చేసుకుంది. అయితే తమ ఓటములపై మ్యాచ్ అనంతరం స్పందించాడు కేఎల్ రాహుల్. ఈ సీజన్ మెుత్తం మాకు ఒకే సమస్య ఎదురైందని, దాన్ని వల్లే ఓడిపోయామని వైఫల్యానికి కారణం చెప్పుకొచ్చాడు లక్నో కెప్టెన్.

ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతులెత్తేసింది. 19 పరుగుల తేడాతో ఢిల్లీపై ఓడిపోయింది. ఢిల్లీ నిర్దేశించిన 209 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో 9 వికెట్లు కోల్పోయి 189 రన్స్ చేసింది. 3 కీలక వికెట్లు తీసి లక్నో పతనాన్ని శాసించాడు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ. అయితే ఈ సీజన్ లో తమ వైఫల్యానికి  కారణం చెప్పుకొచ్చాడు కెప్టెన్ కేఎల్ రాహుల్.

కేఎల్ రాహుల్ మాట్లాడుతూ..”ఈ మ్యాచ్ లో మేము సూపర్ ఫామ్ లో ఉన్న జేక్ ఫ్రేజర్ ను త్వరగా ఔట్ చేసి మంచి శుభారంభం అందుకున్నాం. కానీ దానిని మేం ఉపయోగించుకోలేకపోయాం. అభిషేక్ పోరెల్, స్టబ్స్, షై హోప్ అద్భుతంగా రాణించారు. 200 పరుగులు టార్గెట్ పెద్ద లక్ష్యమేమీ కానప్పటికీ నాతో సహా మా బ్యాటర్లు అంతా విఫలం అయ్యారు. ఇక ఈ సీజన్ లో మాకు మెుదటి నుంచి ఎదురౌతున్న సమస్య పవర్ ప్లేలో త్వరగా వికెట్లు కోల్పోవడమే. దాంతో మేము సరైన శుభారంభాలు అందుకోలేకపోయాము. ఈ సీజన్ మెుత్తం మాకు ఇదే సమస్యగా మారి, మా వైఫల్యానికి కారణమైంది. హిట్టర్లు పూరన్, స్టోయినిస్ లకు మేం సహకారం అందించలేకపోయాం. అందుకే మాకు ఈ పరిస్థితి ఎదురైంది” అంటూ చెప్పుకొచ్చాడు కేఎల్ రాహుల్. కాగా.. ఈ సీజన్ లో 13 మ్యాచ్ ల్లో 6 గెలిచి, 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది లక్నో.