SNP
KL Rahul, MS Dhoni, Helicopter Shot: టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌కు వరల్డ్ కప్‌లో చోటు దక్కకపోవడంతో.. మరింత కసితో ఆడుతూ.. ఏకంగా ధోనిలా మారాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..
KL Rahul, MS Dhoni, Helicopter Shot: టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌కు వరల్డ్ కప్‌లో చోటు దక్కకపోవడంతో.. మరింత కసితో ఆడుతూ.. ఏకంగా ధోనిలా మారాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..
SNP
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పేరు ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ వర్గాల్లో మారుమోగిపోతోంది. ఎందుకంటే.. టీ20 వరల్డ్ కప్ 2024కు రాహుల్‌కు చోటు దక్కలేదు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా టీ20 వరల్డ్ కప్‌లో రాహుల్‌కు చోటు దక్కుతుందని చాలా మంది భావించారు. పైగా రాహుల్ సైతం ఐపీఎల్‌లో వికెట్ కీపర్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాడు. తన టీమ్‌లో క్వింటన్ డికాక్ లాంటి క్వాలిటీ వికెట్ కీపర్ ఉన్నా కూడా.. తనని కాదని వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. దీంతో.. రాహుల్ ప్లేస్ కన్ఫామ్ అయి ఉంటుందని అందుకే కీపింగ్ చేస్తున్నాడంటూ.. క్రికెట్ అభిమానులు కూడా వరల్డ్ కప్ టీమ్ ప్రకటన కంటే ముందు చర్చించుకున్నారు.
కానీ, తీరా టీమ్ ప్రకటించిన తర్వాత చూస్తే.. రాహుల్‌కు చోటు దక్కలేదు. దీంతో చాలా మంది క్రికెట్ అభిమానులు ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ లాంటి ఒక సీనియర్ బ్యాటర్ మిడిల్డార్‌లో ఉంటే టీమ్ ఎంతో ఉపయోగంగా ఉండేవాడని, పైగా స్లో పిచ్‌లపై రాహుల్ అద్భుతంగా ఆడతాడని, అలాంటి ప్లేయర్‌ను ఎలా పక్కనపెడతారంటూ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. అయితే.. తనకు వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కకపోవడంపై రాహుల్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఒక విధంగా చెప్పాలంటే.. టీమ్ ప్రకటించిన రోజు సాయంత్రం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ అంత ఎనర్జిటిక్‌గా కనిపించలేదు. అయితే.. వరల్డ్ కప్ టీమ్‌లో ప్లేస్ దక్కకపోవడంతో రాహుల్‌లో మరింత కసిని పెంచిందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. అది ఎలాగంటే.. అతను ఆడుతున్న విధానమే అందుకు నిదర్శనమంటున్నారు.
మంగళవారం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆడిన ఓ షాట్.. రాహుల్‌లో ఉన్న కోపం, కసిని చూపిస్తున్నాయని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ముంబై బౌలర్ నువాన్ తుషార వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో రాహుల్ విధ్వంస సృష్టించాడు. 4, 1, 6, 4, 4తో ఏకంగా 19 పరుగులు రాబట్టాడు. అందులో చివరి బాల్‌కు కొట్టిన ఫోర్ మాత్రం సూపర్ అని చెప్పాలి. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ట్రేడ్ మార్క్ షాట్.. హెలికాప్టర్ షాట్‌తో రాహుల్ ఆ బౌండరీ సాధించాడు. రాహుల్ ఇలాంటి షాట్స్ అసలు ఆడడు. ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఆడి రన్స్ సాధిస్తాడు. కానీ, ఎప్పుడైతే వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కలేదో.. తన పంథా మార్చుకుని.. మాస్ బ్యాటింగ్‌కు దిగాడు. దాని కోసం ధోనిలా మారిపోయి.. హెలికాప్టర్ షాట్స్ కూడా ఆడేస్తున్నాడు. మరి రాహుల్ హెలికాప్టర్ షాట్‌తో పాటు, అతనికి వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
KL RAHUL WITH A HELICOPTER SHOT. 🚁pic.twitter.com/A2k7nDvDqA
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2024