iDreamPost
android-app
ios-app

వీడియో: ఇది IPL అనుకున్నాడు! రోహిత్ ముందు దూబే పరువుతీసిన రాహుల్‌!

  • Published Aug 02, 2024 | 7:24 PM Updated Updated Aug 02, 2024 | 7:24 PM

KL Rahul, Shivam Dube, Rohit Sharma, IND vs SL: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

KL Rahul, Shivam Dube, Rohit Sharma, IND vs SL: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Aug 02, 2024 | 7:24 PMUpdated Aug 02, 2024 | 7:24 PM
వీడియో: ఇది IPL అనుకున్నాడు! రోహిత్ ముందు దూబే పరువుతీసిన రాహుల్‌!

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత్‌-శ్రీలంక మధ్య కొలంబో వేదికగా తొలి వన్డే ప్రారంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆరంభంలో తడబడినా.. చివర్లో మంచి భాగస్వామ్యాలతో టీమిండియా ముందు ఫైటింగ్‌ టోటల్‌ను పెట్టింది లంక జట్టు. అయితే.. శ్రీలంక బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఈ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో మాట్లాడుతూ.. వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌, యువ క్రికెటర్‌ శివమ్‌ దూబే పరువుతీశాడు. ఇదంతా స్టంప్‌ మైక్‌లో రికార్డ్‌ అయింది. ఈ ఫన్నీ ఇన్నిడెంట్‌ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శివమ్‌ దూబే వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ నాలుగో బంతి.. బ్యాటర్‌ డౌన్‌ ది లెగ్‌ సైడ్‌ వెళ్లింది. అయితే.. బ్యాట్‌ తగిలింది అని శివమ్‌ దూబే అప్పీల్‌ చేస్తాడు. కానీ, అంపైర్‌ దాన్ని వైడ్‌గా ప్రకటిస్తాడు. కానీ, దూబే.. రివ్యూ తీసుకోవాల్సిందిగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను కోరాడు. అయితే.. రోహిత్‌ మాత్రం రివ్యూ తీసుకునేందుకు వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ను సంప్రదిస్తాడు. ఆ సమయంలో.. ఐపీఎల్‌లో రివ్యూ తీసుకుంటే వైడ్‌ బాల్‌ని కూడా రివ్యూ చేసే అవకాశం ఉంటుంది దూబే రివ్యూ అడుతున్నాడంటూ కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌తో అన్నాడు. వెంటనే ఇద్దరూ నవ్వుకొని రివ్యూ తీసుకోరు.

బ్యాట్‌, ప్యాడ్‌కి దగ్గర్నుంచి పోతున్న బాల్‌ను అంపైర్‌ బ్యాట్‌ ఇస్తే.. దాన్ని క్యాచ్‌ కోసం రీవ్యూ తీసుకుంటే.. ఒక వేళ వికెట్‌ దక్కపోయినా.. బాల్‌ ప్యాట్‌కి మాత్రం తగిలితే దాన్ని లీగల్‌ డెలవరీగా ప్రకటిస్తాడు. అదే రూల్‌ ఇక్కడ కూడా ఉందనుకుని దూబే రివ్యూ తీసుకోమంటున్నాడు? అంటూ కేఎల్‌ రాహుల్‌ సెటైర్లు వేశాడు. అంతర్జాతీయ క్రికెటర్‌లో రివ్యూ తీసుకుంటే.. అది అవుట్‌ అయితేనే దాన్ని లీగల్‌ డెలవరీగా ప్రకటిస్తారు.. బ్యాట్‌కి తాకకుండా, బ్యాటర్‌ ప్యాడ్‌కి తాకినా.. ఫీల్డ్‌ అంపైర్‌ దాన్ని ముందు వైడ్‌గా ప్రకటించి ఉంటే వైడ్‌గా ప్రకటిస్తారు. అందులో ఎలాంటి మార్పు ఉండదు. కేవలం బ్యాట్‌కు తాకిందా లేదా అని మాత్రమే చేస్తారు. మరి ఈ ఇన్సిడెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.