iDreamPost
android-app
ios-app

KL Rahul: తనకు జరిగిన ఘోర అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న KL రాహుల్‌!

  • Published Dec 22, 2023 | 5:05 PM Updated Updated Dec 23, 2023 | 11:19 AM

పటిష్టమైన సౌతాఫ్రికా జట్టును వాళ్ల దేశంలో ఓడించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా పూర్తిగా కుర్రాళ్ల జట్టుతో వెళ్లి.. వన్డే సిరీస్‌ నెగ్గడం గొప్ప విషయం. ఈ విజయంతో కేఎల్‌ రాహుల్‌.. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

పటిష్టమైన సౌతాఫ్రికా జట్టును వాళ్ల దేశంలో ఓడించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా పూర్తిగా కుర్రాళ్ల జట్టుతో వెళ్లి.. వన్డే సిరీస్‌ నెగ్గడం గొప్ప విషయం. ఈ విజయంతో కేఎల్‌ రాహుల్‌.. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 22, 2023 | 5:05 PMUpdated Dec 23, 2023 | 11:19 AM
KL Rahul: తనకు జరిగిన ఘోర అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న KL రాహుల్‌!

సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా 1-1తో సమం చేసింది. ఆ తర్వాత.. కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలోని టీమిండియా 2-1 తేడాతో సౌతాఫ్రికా గడ్డపై వాళ్లను ఓడించి సిరీస్‌ గెలిచింది. ప్రొటీస్‌ గడ్డపై వన్డే సిరీస్‌ గెలిచిన రెండో భారత కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ నిలిచాడు. రాహుల్‌ కంటే ముందు విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా సౌతాఫ్రికాపై వారి సొంతగడ్డపై వన్డే సిరీస్‌ నెగ్గింది. అయితే.. ఈ సిరీస్‌ విజయంతో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా సాధించిన రికార్డును పక్కనపెడితే.. తనకు జరిగిన ఘోర అవమానానికి మాత్రం ప్రతీకారం తీర్చుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

విరాట్‌ కోహ్లీ తర్వాత టీమిండియాకు రోహిత్‌ శర్మ రెగ్యులర్‌ కెప్టెన్‌గా ఉన్నా.. చాలా మంది కెప్టెన్లుగా వ్యవహరించారు. రోహిత్‌ శర్మ, హార్ధిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, అంజిక్యా రహానె, జస్ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇలా చాలా మంది కెప్టెన్లుగా వ్యవహరించారు.. అయితే.. 2022లో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలోని టీమిండియా సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడింది. ఆ సిరీస్‌లో టీమిండియా ఘోరంగా.. 0-3 తేడాతో ఓటమి పాలైంది. దీంతో.. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.

జట్టును నడిపించే సత్తా రాహుల్‌లో లేవని.. రోహిత్‌ శర్మ తర్వాత ఇతనికి కెప్టెన్‌ అయ్యే అర్హత లేదంటూ చాలా మంది దారుణంగా విమర్శలు గుప్పించారు. కానీ, సరిగ్గా ఏడాది తిరగకముందే.. అదే సౌతాఫ్రికా గడ్డపై ఆ జట్టును కుర్రాళ్లతో కలిసి ఓడించాడు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌. 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో అప్పుడు రాహుల్‌ పై లేచిన నోళ్లు ఇప్పుడు మూతపడ్డాయనే చెప్పాలి. అయినా రాహుల్‌లో ఒక మంచి కెప్టెన్‌ ఉన్నాడనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి సౌతాఫ్రికాపై రాహుల్‌ కెప్టెన్సీలో టీమిండియా వన్డే సిరీస్‌ గెలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.