SNP
KL Rahul, IND vs SL: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను అందుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. శ్రీలంకతో మూడో వన్డేలో రాహుల్ ఈ రికార్డును అందుకునే అవకాశం ఉంది. మరి ఆ ఘనతేంటో ఇప్పుడు చూద్దాం..
KL Rahul, IND vs SL: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను అందుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. శ్రీలంకతో మూడో వన్డేలో రాహుల్ ఈ రికార్డును అందుకునే అవకాశం ఉంది. మరి ఆ ఘనతేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ అరుదైన మైలురాయిని అందుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత.. పెద్ద దిక్కులా కనిపించిన రాహుల్ ఎందుకో గత కొంత కాలంగా తన స్థాయి ప్రదర్శన చేయలేక వెనుకబడ్డాడు. అయినా కూడా అతనికి టెక్నిక్, బ్యాటింగ్ స్టైల్‌తో ఒక డిఫరెంట్ ప్లేయర్‌గా పేరుతెచ్చుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2024 కంటే ముందు భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న రాహుల్.. ఆ తర్వాత.. బ్యాడ్ ఫామ్‌తో జట్టులో స్థానంతో పాటు వైస్ కెప్టెన్సీ పోస్టును కూడా కోల్పోయాడు. టీ20 టీమ్‌లో లేకపోయినా.. వన్డేలు, టెస్టుల్లో ఇప్పటికీ.. కోహ్లీ, రోహిత్ తర్వాత అతనే బ్యాక్‌బోన్‌గా ఉన్నాడు.
ముఖ్యంగా మిడిల్డార్‌లో కేఎల్ రాహుల్ ఇచ్చే స్టాండింగ్‌తో టీమిండియా ఒక స్ట్రాంగ్ టీమ్‌గా మారిపోయింది. వన్డే వరల్డ్ కప్ 2023లో కేఎల్ రాహుల్ ఎలాంటి అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడో మనం చూశాం. క్రిటికల్ టైమ్‌లో, అలాగే స్లో పిచ్‌లపై కూడా మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతూ టీమిండియా ఫైనల్ వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్న కేఎల్ రాహుల్.. తాజాగా ఓ అరుదైన ఘనతను అందుకునేందుకు రెడీ అయిపోయాడు. కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య బుధవారం జరగనున్న చివరిదైన మూడో వన్డేలో కేఎల్ రాహుల్ ఆడితే.. అది అతని కెరీర్‌లో 200వ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ అవుతుంది.
2014 డిసెంబర్ 26న ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌తో కేఎల్ రాహుల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అలాగే 2016లో వన్డే, టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 టెస్టులు, 77 వన్డేలు, 72 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం కలిపి 199 అంతర్జాతీయ మ్యాచ్‌లు అయ్యాయి. ఇప్పుడు శ్రీలంకతో మూడో వన్డేలో బరిలోకి దిగితే 200 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకుంటాడు. అయితే.. తొలి రెండు వన్డేలో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయని రాహుల్‌ను పక్కనపెట్టి.. మూడో వన్డేలో రిషభ్ పంత్‌ను ఆడిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి రాహుల్ 200 మార్క్‌ను అందుకుంటాడో లేదో చూడాలి.
KL Rahul will be playing his 200th International match for India 👌
– He has been a backbone of Indian batting, deserving milestone for the main man in middle order. pic.twitter.com/k5l5f7XBFk
— Johns. (@CricCrazyJohns) August 7, 2024