టాలెంట్‌, స్టార్‌డమ్‌ ఉన్నా.. ఒక్క కప్పులేని క్రికెటర్‌! టీమ్‌లో అత్యంత దురదృష్టవంతుడు!

T20 World Cup 2024, Rohit Sharma, Virat Kohli, KL Rahul: భారత క్రికెట్‌ జట్టులో కొంతమంది స్టార్‌ క్రికెటర్లు ఉన్నారు.. వారిలో ఓ అత్యంత దురదృష్టవంతుడా కూడా ఉన్నాడు. మరి ఆ ఆటగాడు ఎవరో? అతని దురదృష్టం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

T20 World Cup 2024, Rohit Sharma, Virat Kohli, KL Rahul: భారత క్రికెట్‌ జట్టులో కొంతమంది స్టార్‌ క్రికెటర్లు ఉన్నారు.. వారిలో ఓ అత్యంత దురదృష్టవంతుడా కూడా ఉన్నాడు. మరి ఆ ఆటగాడు ఎవరో? అతని దురదృష్టం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియాలో కొన్ని ఏళ్లుగా ఆడుతూ.. జట్టులో పాతుకుపోయి.. టీమ్‌కు పెద్ద దిక్కుగా మారిన దిగ్గజ క్రికెటర్లు ఎన్ని రన్స్‌ చేశారనే దానితో పాటు.. వారి ఖాతాలో ఎన్ని ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయని కూడా క్రికెట్‌ అభిమానులు చూస్తారు. క్రికెట్‌ ఫ్యాన్స్‌ విషయం పక్కనపెడితే.. ఆటగాళ్ల కూడా తమ కెరీర్‌లో వరల్డ్‌ కప్‌ గెలవడం లక్ష్యంగా పెట్టుకుంటారు. ఐదు వరల్డ్‌ కప్స్‌ ఆడిన తర్వాత కానీ.. సచిన్‌ వన్డే వరల్డ్‌ కప్‌ గెలవలేకపోయాడు. అలాగే విరాట్‌ కోహ్లీ 15 ఏళ్లుగా టీమిండియాలో ఉన్నా.. మొన్న టీ20 వరల్డ్‌ కప్‌ అందుకున్నాడు. టీమిండియా క్రికెట్‌ చరిత్రలోనే దిగ్గజ క్రికెటర్లుగా ఉన్న సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌లు వరల్డ్‌ కప్‌ను ముద్దాడలేకపోయారు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఖాతాలో కూడా వన్డే వరల్డ్‌ కప్‌ లేదు. ఇలా ప్రతి దిగ్గజ ఆటగాడి కెరీర్‌ కప్పులతో ఏదో ఒక విధంగా వరల్డ్‌ కప్పులతో ముగిపడి ఉంది.

కానీ, టీమిండియాలో మోస్ట్‌ అన్‌లక్కీ ఫెలో ఒకడు ఉన్నాడు. ఏడాది క్రితం వరకు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ తర్వాత.. అతనే టీమిండియాకు పెద్ద దిక్కు అనుకున్నారు. చాలా కాలం పాటు జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. స్టార్‌ డమ్‌లోనూ కోహ్లీ, రోహిత్‌కు పోటీ కూడా ఇచ్చాడు. ఇక టాలెంట్‌లో విషయంలో కూడా అతనేం తక్కువ కాదు. టన్నుల కొద్ది టాలెంట్‌ ఉంది. కానీ, అంతకు మించి దురదృష్టం కూడా ఉంది. ఆ మోస్ట్‌ అన్‌లక్కీ క్రికెటర్‌ ఎవరో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఎస్‌.. అతను కేఎల్‌ రాహులే. 2014 నుంచి టీమిండియాలో ఉన్నాడు.. కానీ, అతని ఖాతాలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు. ఈ 10 ఏళ్ల కాలంలో టీమిండియా ఒక్కటే ఐసీసీ ట్రోఫీ గెలిచింది. కానీ, అందులో కూడా పాపం అతను భాగం కాలేకపోయాడు.

ఐపీఎల్‌ 2024 కంటే ముందు పెద్ద ఫామ్‌లో లేని కేఎల్‌ రాహుల్‌ భారత జట్టులో స్థానం కోల్పోయాడు. ఐపీఎల్‌ 2024లో రాణించినా.. భారత సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేయలేదు. దాంతో.. టీ20 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ టీమ్‌లో భాగం అయ్యే అవకాశం కోల్పోయాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023, టీ20 వరల్డ్‌ కప్‌ 2022, 2021, వన్డే వరల్డ్‌ కప్‌ 2019 టీమ్స్‌లో అతను భాగమైనా.. ఆయన కప్పులను టీమిండియా గెలవడంలో విఫలమైంది. ఇలా కేఎల్‌ రాహుల్‌ పాపం.. ఒక్క ట్రోఫీ కూడా లేని స్టార్‌ ఆటగాడిగా మిగిలిపోయాడు. కనీసం 2025లో జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీ టీమ్‌లోకి అయినా వచ్చి.. ఆ కప్పు సాధించి.. ఐసీసీ ట్రోఫీ లేని లోటును తీర్చుకుంటాడో లేదో చూడాలి. మరి కేఎల్‌ రాహుల్‌ దరిద్రంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments