వీడియో: భయపడుతూనే సాహసం చేసిన KL రాహుల్‌! స్టంట్‌ ప్లేన్‌లో..

వీడియో: భయపడుతూనే సాహసం చేసిన KL రాహుల్‌! స్టంట్‌ ప్లేన్‌లో..

KL Rahul, Red Bull, Stunt Plane: భారత స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ తాజాగా ఓ పెద్ద సాహసం చేశాడు. అది ఏంటో? ఎందుకు అలా చేశాడో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

KL Rahul, Red Bull, Stunt Plane: భారత స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ తాజాగా ఓ పెద్ద సాహసం చేశాడు. అది ఏంటో? ఎందుకు అలా చేశాడో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

చాలా కాలంగా టీమిండియాలో పెద్దగా కనిపించని కేఎల్‌ రాహుల్‌ తాజాగా ఓ పెద్ద సాహసమే చేశాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 తర్వాత.. టీ20ల్లో పెద్దగా రాణించని రాహుల్‌కు టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టీమ్‌లో చోటు దక్కలేదు. అలాగే ఐపీఎల్‌ 2024లో కూడా రాహుల్‌ పెద్దగా రాణించలేదు. అందుకే అతనికి టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కలేదు. అయితే.. ఆగస్టు 2 నుంచి శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌తో రాహుల్‌ తిరిగి టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ సిరీస్‌ కంటే ముందు రాహుల్‌ ఓ పెద్ద సాహసం చేశాడు. అదేంటంటే.. స్టంట్‌ ప్లేన్‌లో చక్కర్లు కొట్టాడు.

రెడ్‌బుల్‌ స్టంట్‌ ప్లేన్‌లో డారియో కోస్టా అనే పైలెట్‌తో కలిసి.. కేఎల్‌ రాహుల్‌ ప్రయాణించాడు. స్టంట్‌ ప్లేన్‌ నడిపిన తర్వాత రాహుల్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఇది నిజంగా అద్భుతం! ఇంతకు ముందెన్నడూ ఇలాంటి అనుభూతి నేను ఆస్వాదించలేదంటూ తన సంతోషాన్ని వెల్లడించాడు. మొత్తం 20 నిమిషాల పాటు నా ఫోకస్‌ అంతా దానిపైనే ఉంది. కానీ, అందులో ఉన్నంత సేపు భయపడుతూనే ఉన్నానని రాహుల్‌ అన్నాడు. అయితే.. ఆటగాళ్ల ఇలాంటి సాహసాలు చేయడంతో వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఇక శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత జట్టు త్వరలోనే శ్రీలంకకు వెళ్లనుంది. ఇప్పటికే సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా శ్రీలంకకు వెళ్లింది. లంకతో మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. శనివారం నుంచి టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. అయితే.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియాకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌ను ఇటీవలె ఆ బాధ్యతల నుంచి తప్పించారు. వన్డే వైస్‌ కెప్టెన్‌గా యువ క్రికెటర్‌ శుబ్‌మన​ గిల్‌ను నియమించింది బీసీసీఐ. క్రికెటర్‌గా రాహుల్‌కు ప్రస్తుతం టఫ్‌ టైమ్‌ నడుస్తోంది.. ఇలాంటి టైమ్‌లో రాహుల్‌ చేసిన ఈ సాహసంతో అతని కాన్ఫిడెన్స్‌ పెరిగి.. శ్రీలంకతో సిరీస్‌లో రాణిస్తాడని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments