SNP
ఏ ఆటగాడైనా తన కెరీర్‌లో సాధించిన విజయాలను తన రిటైర్మెంట్ తర్వాత నెమరవేసుకుంటూ ఉంటారు. అయితే.. తాను రిటైర్ అయిన తర్వాత తనకు ఏం గుర్తుంటాయో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తాజాగా వెల్లడిస్తూ.. ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఏ ఆటగాడైనా తన కెరీర్‌లో సాధించిన విజయాలను తన రిటైర్మెంట్ తర్వాత నెమరవేసుకుంటూ ఉంటారు. అయితే.. తాను రిటైర్ అయిన తర్వాత తనకు ఏం గుర్తుంటాయో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తాజాగా వెల్లడిస్తూ.. ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఈ మధ్య కాలంలో అద్భుతంగా ఆడుతున్నాడు. ఐపీఎల్ 2023లో గాయం కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన ఈ స్టార్ ప్లేయర్.. గాయం నుంచి వరల్డ్ కప్ కంటే కాస్త ముందుగా తిరిగొచ్చాడు. అప్పటి నుంచి ఒక డిఫరెంట్ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లు విఫలమైన చోట కూడా.. తానో సెవియర్‌లా నిలబడి జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయినా.. విరాట్ కోహ్లీతో కలిసి రాహుల్ ఆడిన ఇన్నింగ్స్‌ను క్రికెట్ అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు.
తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైనా.. కేఎల్ రాహుల్ ఆడిన తీరుపై మాత్రం ప్రశంసల వర్షం కురిసింది. తొలి ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్లంతా విఫలమైనా.. కేఎల్ సెంచరీతో చెలరేగి అద్భుతమైన టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. ఇలా గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత.. రాహుల్ బ్యాటింగ్ స్టైల్, య్యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయింది. మంచి టెంపో చూసిస్తూ.. అద్భుతంగా ఆడుతూ.. మిడిల్డార్‌లో టీమిండియాకు వెన్నుముకలా మారిపోయాడు. వికెట్ కీపింగ్‌లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. ఈ క్రమంలో వరల్డ్ కప్ ఓటమి, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం సాధించడం గురించి రాహుల్ మాట్లాడుతూ.. కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుతంగా ఆడిన టీమిండియా.. ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి కప్పును చేజార్చుకుంది. ఆ ఓటమి కోట్ల మంది భారతీయ క్రికెట్ అభిమానులను తీవ్రంగా బాధించింది. అయితే.. సౌతాఫ్రికాతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌ను రాహుల్ కెప్టెన్సీలో యంగ్ టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. సౌతాఫ్రికా గడ్డపై చాలా కాలం తర్వాత వన్డే సిరీస్ నెగ్గింది భారత్. ఈ విజయం గురించి రాహుల్ మాట్లాడుతూ.. ఓ పది పదిహేనేళ్ల తర్వాత మేం రిటైర్ అయిపోతే.. ఈ సిరీస్ విజయాలు గుర్తుండవు, వరల్డ్ కప్ గెలిస్తే గుర్తుంటుంది. అందుకే తాము వరల్డ్ కప్ గెలవడానికి మరింత కసిగా ఉన్నామని తెలిపాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ 2024 ఉన్న విషయం తెలిసిందే. మరి రాహుల్ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
KL Rahul said “10 or 15 years later when we retire we will not remember our career for Bilateral series – World Cups are the only thing that we will remember – there is that extra fire in us to go a couple of steps further the next time”. [Star Sports] pic.twitter.com/o4uMILVlqE
— Johns. (@CricCrazyJohns) December 31, 2023