SNP
SNP
ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా సూపర్ స్టార్ట్ అందుకుంది. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి.. మెగా టోర్నీలో శుభారంభం చేసింది. మ్యాచ్‌ను చాలా క్లిష్టపరిస్థితుల్లో గెలిచింది టీమిండియా. 2 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత.. మ్యాచ్‌ను 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే.. ఈ విజయంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించారు. వెంటవెంటనే మూడు వికెట్లు పడిన తర్వాత.. జట్టు పరిస్థితులకు తగ్గట్లు ఆడుతూ.. మ్యాచ్‌ను ఆసీస్ చేతుల్లోంచి లాక్కొచ్చారు. ఈ అద్భుత ప్రదర్శనతో కోహ్లీ, రాహుల్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది.
అయితే.. ఈ ఇన్నింగ్స్ తర్వాత కేఎల్ రాహుల్ కాస్త ఎమోషనల్ అయినట్లు తెలుస్తుంది. గతంలో తన ఫామ్ గురించి, టీమ్‌లో ప్లేస్ గురించి వచ్చిన విమర్శలపై స్పందించిన రాహుల్.. తాను బాగా ఆడుతున్న సమయంలో కూడా తనపై చాలా మంది విమర్శలు చేశారని, ఆ సమయంలో చాలా బాధపడ్డాడనని అన్నాడు. వారి మాటలు తనను ఎంతో బాధించాయని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ 2023 కంటే ముందు రాహుల్.. పరుగులు చేస్తున్నా కాస్త నిదానంగా ఆడటం, టీ20 వరల్డ్ కప్స్‌లో స్లో స్టార్ట్స్‌తో క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఐపీఎల్ సందర్భంగా గాయపడిన రాహుల్.. తిరిగి కోలుకుని ఆసియా కప్ 2023తో రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఆ సమయంలో కూడా రాహుల్‌ను టీమ్‌లోకి ఎందుకు తీసుకుంటున్నారంటూ విమర్శలు వచ్చాయి. కానీ, ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో రాహుల్ సత్తా చాటాడు. అక్కడి నుంచి రాహుల్ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించి టీమ్‌ను గెలిపించడమే కాకుండా.. రెండు వరుస హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. ఇప్పుడు వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌తోనే టీమిండియా సూపర్ విక్టరీ అందించాడు. 97 రన్స్‌తో నాటౌట్‌తో నిలిచిన రాహుల్.. సెంచరీ చేసి ఉంటే ఇంకా బాగుండేదని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి రాహుల్ బ్యాడ్ టైమ్‌లో వచ్చిన విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
KL Rahul talking about criticism & trolls inspite good performances and his only one aim and motivation to win the World Cup for India.
– What a inspiring comeback of KL Rahul, What a player! pic.twitter.com/TJlegaqcQg
— CricketMAN2 (@ImTanujSingh) October 9, 2023
ఇదీ చదవండి: హ్యాట్సాఫ్ రాహుల్! ఈ ఆటతో మరో యువరాజ్ కాబోతున్నాడా?