SNP
SNP
ఆసియా కప్ 2023లో భాగంగా.. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఆసియా కప్ సూపర్ 4లో టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే.. ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు రోహిత్ శర్మ-శుబ్‌మన్ గిల్ టీమిండియాకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా పాక్ పేస్ బౌలర్ అఫ్రిదీని టార్గెట్ చేస్తూ మరీ టీమిండియా ఓపెనర్లు రెచ్చిపోయారు.
గిల్.. షాహీన్ అఫ్రిదీని టార్గెట్ చేసి కొడితే.. రోహిత్ వర్మ, షాదాబ్ ఖాన్‌ను టార్గెట్ చేసి కొట్టారు. దీంతో వారిద్దరూ ఒత్తిడిలోకి వెళ్లారు. ఓపెనర్ల దూకుడుతో టీమిండియా స్కోర్ రాకెట్‌లా దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే రోహిత్-గిల్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కానీ, హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న కొద్ది సేపటికే రోహిత్-గిల్ ఏ బౌలర్లనైతే టార్గెట్ చేశారో.. వారి బౌలింగ్‌లోనే అవుట్ అయ్యారు. రోహిత్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 56 పరుగులు చేసి షాదాబ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి ఫహీమ్ అష్రఫ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక గిల్.. 52 బంతుల్లో 10 ఫోర్లతో 58 పరుగులు చేసి.. షాహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో అఘా సల్మాన్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో టీమిండియా వెంటవెంటనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు రోహిత్-గిల్ 121 పరుగులు జోడించి.. మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు.
వన్‌డౌన్‌లో కోహ్లీ బ్యాటింగ్‌కు రాగా.. నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ వచ్చాడు. దాదాపు 6 నెలల గ్యాప్ తర్వాత రాహుల్ టీమిండియా తరఫున బరిలోకి దిగాడు చివరి సారిగా ఈ ఏడాది మార్చ్ 22న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ఆడిని రాహుల్.. ఆ తర్వాత ఐపీఎల్‌లో గాయపడి.. టీమిండియాకు దూరం అయ్యాడు. తాజాగా గాయంతో తిరిగి వచ్చిన రాహుల్.. శ్రేయస్ అయ్యర్ స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడుతున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్‌లో 28 బంతుల్లో 17 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. వర్షం రావడంతో మ్యాచ్లో అంతరాయ కలిగింది.
అయితే.. రాహుల్ క్రీజ్‌లోకి వచ్చే సమయానికి రెండు వికెట్లు వెంటవెంటనే పడటంతో కాస్త నిదానంగా తన ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. కానీ, రెండు అద్భుతమైన పుల్ షాట్లతో మంచి టచ్‌లో కనిస్తున్నాడు. అయితే.. ఈ ఇన్నింగ్స్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ తన వన్డే కెరీర్‌లో 2 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఇప్పటి వరకు 55 వన్డేలు ఆడిన రాహుల్.. 53 ఇన్నింగ్స్‌ల్లో 2003 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి రాహుల్ 2 వేల వన్డే పరుగుల మార్క్ చేరుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
2000 ODI runs and counting for @klrahul 🙌
Live – https://t.co/Jao6lKkWs5… #INDvPAK #AsiaCup2023 pic.twitter.com/We2YfX06gA
— BCCI (@BCCI) September 10, 2023
ఇదీ చదవండి: VIDEO: ఇలాంటి విన్యాసాలు పాకిస్థాన్‌కే సాధ్యం! నవ్వకండి ప్లీజ్..