KL Rahul: ఐపీఎల్ చరిత్రలో కేఎల్ రాహుల్ నయా చరిత్ర.. ఇది కదా రికార్డు అంటే!

ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్. ఈ క్రమంలో ఎంఎస్ ధోని ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్. ఈ క్రమంలో ఎంఎస్ ధోని ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2024 సీజన్ లో రికార్డుల మీద రికార్డులు బద్దలు అవుతున్నాయి. బ్యాటర్లు తమ బ్యాట్ తో రెచ్చిపోతుంటే.. బౌలర్లు కూడా తామేమీ తక్కువ కాదన్నట్లుగా రాణిస్తున్నారు. ఇక నిన్న(ఏప్రిల్ 19) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఈ క్రమంలో సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు కేఎల్ రాహుల్. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం పదండి.

చెన్నై సూపర్ కింగ్స్ కు షాకిస్తూ.. తాజాగా జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది లక్నో సూపర్ జెయింట్స్ టీమ్. 177 పరుగుల టార్గెట్ ను 19 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 82 రన్స్, క్వింటన్ డికాక్ 54 పరుగులతో తొలి వికెట్ కు 134 రన్స్ జోడించి.. చెన్నైకి విజయంపై ఆశలు లేకుండా చేశారు. ఇక ఈ మ్యాచ్ లో ఫిఫ్టీ కొట్టడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్. ఈ క్రమంలో మహేంద్రసింగ్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్ లో అర్ధశతకం సాధించడం ద్వారా కేఎల్ రాహుల్ ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ఫిఫ్టీస్ కొట్టిన తొలి వికెట్ కీపర్ గా నిలిచాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ టోర్నీలో 25 అర్దశతకాలు బాదాడు రాహుల్. ఐపీఎల్ కెరీర్ లో రాహుల్ 35 అర్దశతకాలు కొట్టాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని ఈ క్యాష్ రిచ్ లీగ్ లో వికెట్ కీపర్ గా 24 ఫిఫ్టీస్ కొట్టాడు. ఇప్పుడు ఈ రికార్డును తుడిచేశాడు కేఎల్ రాహుల్. ఇక ఈ లిస్ట్ లో మూడో ప్లేస్ లో ఉన్నాడు క్వింటన్ డికాక్, 21 అర్దశతకాలతో దినేశ్ కార్తీక్ 4వ ప్లేస్, 18 ఫిఫ్టీస్ తో రాబిన్ ఊతప్ప 5వ స్థానాల్లో ఉన్నారు. ఈ రికార్డుతో రాహుల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇది కాదా రికార్డు అంటే.. అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరి ఐపీఎల్ హిస్టరీలో రాహుల్ క్రియేట్ చేసిన నయా రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments