iDreamPost

Ravindra Jadeja: జడేజా స్టన్నింగ్ క్యాచ్.. గైక్వాడ్ షాకింగ్ రియాక్షన్! వీడియో వైరల్

లక్నోతో జరిగిన మ్యాచ్ లో చెన్నై స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా పట్టిన స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. ఇక ఈ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ కు కెప్టెన్ రుతురాజ్, బౌలర్ పతిరణ ఇచ్చిన రియాక్షన్స్ వైరల్ గా మారాయి.

లక్నోతో జరిగిన మ్యాచ్ లో చెన్నై స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా పట్టిన స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. ఇక ఈ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ కు కెప్టెన్ రుతురాజ్, బౌలర్ పతిరణ ఇచ్చిన రియాక్షన్స్ వైరల్ గా మారాయి.

Ravindra Jadeja: జడేజా స్టన్నింగ్ క్యాచ్.. గైక్వాడ్ షాకింగ్ రియాక్షన్! వీడియో వైరల్

ఐపీఎల్ అంటే ఫోర్లు, సిక్సర్లతో పాటుగా కళ్లు చెదిరే ఫీల్డింగ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లే. తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచ్ లో లక్నో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేఎల్ రాహుల్ 82 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా కళ్లు చెదిరే అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. జడేజా పట్టిన ఈ స్టన్నింగ్ క్యాచ్ చూసి చెన్నై కెప్టెన్ రుతురాజ్ తో పాటుగా బౌలర్ మతీష పతిరణ ఇచ్చిన రియాక్షన్స్ వైరల్ గా మారాయి.

రవీంద్ర జడేజా.. వరల్డ్ క్లాస్ బెస్ట్ ఫీల్డర్లలో ఒకడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో అదరగొట్టే సత్తాఉన్న వాడు జడేజా. తాజాగా తన మెరుపు ఫీల్డింగ్ మరోసారి క్రికెట్ లవర్స్ ను అబ్బురపరిచాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ను పెవిలియన్ చేర్చాడు జడ్డూ. లక్నో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఈ అద్భుత క్యాచ్ చోటుచేసుకుంది. మతీష పతిరణ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని రాహుల్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. అయితే షాట్ కరెక్ట్ గా కనక్ట్ కాకపోవడంతో.. పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా పక్కనుంచి వెళ్లబోయింది.

అయితే అప్పటికే అక్కడ వేసి చూస్తున్న జడ్డూ.. గాల్లోకి అమాంతం జంప్ చేసి ఒంటి చేత్తో బాల్ ను ఒడిసిపట్టుకున్న తీరు చూసితీరాల్సిందే. ఇక ఈ స్టన్నింగ్ క్యాచ్ చూసిన షాక్ గురైయ్యారు చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, బౌలర్ పతిరణ. అలా ఎలా బంతిని పట్టుకున్నావ్ అనే రీతిలో రియాక్షన్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో వారెవ్వా జడ్డూ భాయ్ భలే అందుకున్నావ్, నువ్వు మనిషివా? లేక పక్షివా? అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరి జడేజా పట్టిన స్టన్నింగ్ క్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి