SNP
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ సౌతాఫ్రికాపై సెంచరీతో చెలరేగాడు. తొలి టెస్టులో కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకోవడమే కాకుండా సెంచరీ చేయడం విశేషం. అయితే.. ఈ సెంచరీతో రాహుల్ కొత్త చరిత్ర సృష్టించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ సౌతాఫ్రికాపై సెంచరీతో చెలరేగాడు. తొలి టెస్టులో కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకోవడమే కాకుండా సెంచరీ చేయడం విశేషం. అయితే.. ఈ సెంచరీతో రాహుల్ కొత్త చరిత్ర సృష్టించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో కేఎల్ రాహుల్ అద్భుతమైన పోరాటంతో టీమిండియాను ఆదుకుని.. గౌరవ ప్రదమైన స్కోర్‌ను అందించాడు. 107 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను సేవ్ చేసి.. సేవియర్‌గా మారిపోయాడు. ఈ క్రమంలోనే ఇతర బ్యాటర్ల నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా.. ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సీనియర్ ప్రోలు విఫలమైన చోట.. నిప్పులు చిమ్ముతున్న ప్రొటీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొవడమే కాకుండా.. వాళ్లపై ఎదురుదాడి చేసి మరీ సెంచరీతో కదం తొక్కాడు. 133 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులతో అదరగొట్టాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. హాఫ్ సెంచరీ, సెంచరీ మార్క్‌లను రాహుల్ సిక్స్ కొట్టి అందుకున్నాడు. దాంతో పాటు ఈ సెంచరీతో కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఈ మ్యాచ్ జరుగుతున్న సెంచూరియన్ గ్రౌండ్‌లో రెండు సెంచరీలు చేసిన తొలి ఓవర్సీస్ ప్లేయర్‌గా కేఎల్ రాహల్ ఘనత సాధించాడు. 2021లో సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటించినప్పుడు సైతం సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఆ సమయంలో ఓపెనర్‌గా ఆడిన రాహుల్.. 260 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్‌తో 123 పరుగులు అదరగొట్టాడు. అప్పుడు ఓపెనర్‌గా ఆడినా.. ఇప్పుడు మిడిల్డార్‌లో ఆడినా.. సెంచూరీయన్ గడ్డా.. తన అడ్డా అని నిరూపించాడు. ఇక్కడ ఆడిన వరుసగా రెండు టెస్టుల్లోనూ కేఎల్ రాహుల్ సెంచరీలు చేయడం విశేషం. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను సౌతాఫ్రికా పేసర్లు ఆరంభంలో వణికించారు.
24 పరుగులకే రోహిత్ శర్మ, జైస్వాల్, గిల్ వికెట్లను కోల్పోయింది భారత్. ఒక్కడి నుంచి విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ జట్టును కాపాడే ప్రయత్నం చేసినా.. లంచ్ తర్వాత వాళ్లిద్దరూ అవుటైపోయారు. దీంతో ఇండియా కనీసం 150 పరుగులైనా చేస్తుందా లేదా అని అంతా అనుమానపడ్డారు. కానీ, కేఎల్ రాహుల్ అనే ఒక అడ్డుగోడ.. సౌతాఫ్రికా బౌలర్లకు ఎదురుగా నిలబడింది. టెయిలెండర్లతో కలిసి.. టీమిండియా స్కోర్‌ను 245 పరుగులకే చేర్చాడు రాహుల్. ఈ క్రమంలోనే తాను సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. మొత్తం టీమిండియాకు ఒక రెస్పెక్ట్‌ఫుల్ టోటల్‌ను అందించాడు. టీమిండియా పేసర్లు కూడా చెలరేగితే.. తొలి టెస్ట్ మరింత రసవత్తరంగా మారడం ఖాయం. మరి 107 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను కేఎల్ రాహుల్ సెంచరీతో ఆదుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
📸📸💯@klrahul 🙌🙌#SAvIND pic.twitter.com/lBEC4UisFa
— BCCI (@BCCI) December 27, 2023