హార్దిక్ పాండ్యా స్థానంలో టీమిండియాకు కొత్త వైస్‌ కెప్టెన్‌ నియామకం

  • Author Soma Sekhar Published - 05:02 PM, Sat - 4 November 23

హార్దిక్ పాండ్యా స్థానంలో టీమిండియాకు కొత్త వైస్ కెప్టెన్ ను నియమించారు. భారత జట్టుకు కొత్త వైస్ కెప్టెన్ గా..

హార్దిక్ పాండ్యా స్థానంలో టీమిండియాకు కొత్త వైస్ కెప్టెన్ ను నియమించారు. భారత జట్టుకు కొత్త వైస్ కెప్టెన్ గా..

  • Author Soma Sekhar Published - 05:02 PM, Sat - 4 November 23

వరల్డ్ కప్ లో వరుస విజయాలతో ఎదురులేకుండా దూసుకుపోతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా వరల్డ్ కప్ కు పూర్తిగా దూరం అయ్యాడని సమాచారం. ప్రస్తుతం అతడు బెంగళూరులోని ఎన్సీఏలో చికిత్స తీసుకుంటున్నాడు. పాండ్యా కాలికి అయిన గాయం మానడానికి చాలా సమయం పడుతుందని.. అందుకే అతడిని వరల్డ్ కప్ నుంచి తప్పించాల్సి వచ్చిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ప్రపంచ కప్ లో టీమిండియా వైస్ కెప్టెన్ గా పాండ్యా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పుడు హార్దిక్ స్థానంలో వైస్ కెప్టెన్ గా టీమిండియా స్టార్ ప్లేయర్ ను నియమించారు.

గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ కు దూరం అయ్యాడు టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. అతడు గాయం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలియడంతో.. భారత జట్టుకు కొత్త వైస్ కెప్టెన్ ను నియమించింది యాజమాన్యం. హార్దిక్ స్థానంలో టీమిండియా వైస్ కెప్టెన్ గా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ను నియమించారు. ఈ వరల్డ్ కప్ లో భారత జట్టు వైస్ కెప్టెన్ గా రాహుల్ బాధ్యతలు తీసుకోనున్నాడు. అయితే రాహుల్ వైస్ కెప్టెన్ గా నియమించబడటం కోత్తేమీ కాదు.. అతడు రోహిత్ లేని టైమ్ లో టీమిండియాకు కెప్టెన్ గా పలు సిరీస్ లకు ప్రాతినిథ్యం వహించిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను నియమించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments