SNP
SNP
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కర్ణాటకలోని ఘాటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాడు. భార్య అతియా శెట్టితో కలిసి శనివారం ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు రాహుల్ దంపతులకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అయితే.. శ్రీలంక వేదికగా జరగుతున్న భారత్-పాక్ మ్యాచ్‌లో రాహుల్ కూడా పాల్గొనాల్సింది. కానీ, గాయం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో.. పాక్‌తో పాటు నేపాల్‌తో జరిగే మ్యాచ్‌కు అతను అందుబాటులో లేడు.
ఆసియా కప్ 2023 కోసం ఎంపిక చేసిన జట్టులో రాహుల్‌కు చోటు దక్కింది. కానీ, పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతను భారత జట్టుతో కలిసి శ్రీలంకకు ప్రయాణం కాలేదు. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోని రిహ్యాబిటేషన్ సెంటర్‌లో తిరిగి కోలుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించి.. రాహుల్ శ్రీలంకకు ప్రయాణం కానున్నాడు. ఆసియా కప్‌లో టీమిండియా ఆడే మిగతా మ్యాచ్‌లో రాహుల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కు సిద్ధం అయ్యేందుకు రాహుల్ ఆసియా కప్‌లో కచ్చితంగా ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. ఐపీఎల్ 2023లో ఆడుతూ రాహుల్ గాయంతో టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. మరి రాహుల్ ఫిట్‌నెస్‌తో పాటు టీమిండియాలో చోటు కల్పించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
KL Rahul & Athiya Shetty visited Ghati Subramanya Swamy Temple. pic.twitter.com/Nn08zvekI3
— Johns. (@CricCrazyJohns) September 2, 2023
ఇదీ చదవండి: IND vs PAK: భారత టాపార్డర్‌కు అఫ్రిదీ ఫోబియా పట్టుకుందా?