Nidhan
వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆర్సీబీకి మరో ఓటమి ఎదురైంది. గెలవాల్సిన మ్యాచ్‌లో డుప్లెసిస్ సేన పరాజయం పాలైంది.
వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆర్సీబీకి మరో ఓటమి ఎదురైంది. గెలవాల్సిన మ్యాచ్‌లో డుప్లెసిస్ సేన పరాజయం పాలైంది.
Nidhan
వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆర్సీబీకి మరో ఓటమి ఎదురైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డుప్లెసిస్ సేన ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఆ టీమ్‌లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 48) విధ్వంసక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 50) యాంకర్ ఇన్నింగ్స్‌తో భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఆఖర్లో ఆండ్రీ రస్సెల్ (20 బంతుల్లో 27 నాటౌట్) బిగ్ షాట్స్‌తో అలరించాడు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లకు 221 పరుగులే చేయగలిగింది. విల్ జాక్స్ (32 బంతుల్లో 55), రజత్ పాటిదార్ (23 బంతుల్లో 52) పోరాడినా టీమ్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయారు. అయితే ఇంత తక్కువ మార్జిన్‌తో ఓడిపోవడం ఆ జట్టుకు కొత్తేమీ కాదు.
ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓడటాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయానికి అంత చేరువగా వచ్చి ఆగిపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి గాడిన పడుతుందేమోనని భావిస్తే అది సాధ్యం కాకపోవడంతో బాధపడుతున్నారు. అదృష్టం వెక్కిరించడం వల్లే తమకు ఓటమి ఎదురైందని భావిస్తున్నారు. అయితే ఐపీఎల్ హిస్టరీలో ఆర్సీబీకి ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో కూడా పలుమార్లు ఆ టీమ్ ఇలా స్మాల్ మార్జిన్స్‌తో ఓడిపోయింది. 2008లో ఫస్ట్ సీజన్లో ఇదే కేకేఆర్ మీద 5 పరుగుల తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆ తర్వాత 2014లో మళ్లీ కోల్‌కతా చేతుల్లోనే 2 పరుగుల తేడాతో విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయింది.
2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మీద 4 పరుగుల తేడాతో ఓడింది ఆర్సీబీ. ఇప్పుడు కేకేఆర్ చేతుల్లో 1 పరుగు తేడాతో ఓడి ప్లేఆఫ్స్ ఆశలను మరింత క్లిష్టతరం చేసుకుంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. దరిద్రానికి కేరాఫ్ అడ్రస్‌గా బెంగళూరును చెబుతున్నారు. ఇంత స్మాల్ మార్జిన్స్‌తో ఓడటం ఏంటని.. మ్యాచ్‌ను ఫినిష్ చేయకపోవడం ఆ టీమ్‌ను దెబ్బతీస్తోందని అంటున్నారు. ఎంత బాగా ఆడినా ఒక్క పరుగు తేడాతోనే ఓడిపోయారంటే దరిద్రం ఆర్సీబీని ఎంతగా వెంటాడుతోందో అర్థం చేసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. బెంగళూరు రాతను ఇంకా ఎవరూ మార్చలేరని అంటున్నారు. మరి.. ఆర్సీబీ ఓటమిపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Narrowest defeat for RCB in IPL history:
1 run Vs KKR, 2024*.
2 runs Vs KKR, 2014.
4 runs Vs SRH, 2021.
5 runs Vs KKR, 2008. pic.twitter.com/03k2JNQWt0— Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2024