iDreamPost

KKR vs MI: వీడియో: బుమ్రా స్టన్నింగ్ యార్కర్​కు నరైన్ బలి.. ఏం వేశాడు భయ్యా!

  • Published May 11, 2024 | 9:49 PMUpdated May 11, 2024 | 9:49 PM

ఈ ఏడాది ఐపీఎల్​లో బౌలర్లు అందరితో ఆడుకుంటున్నాడు సునీల్ నరైన్. ఊచకోత కోస్తూ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. అలాంటి కేకేఆర్ ఓపెనర్​కే పోయించాడు ముంబై ఏస్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా.

ఈ ఏడాది ఐపీఎల్​లో బౌలర్లు అందరితో ఆడుకుంటున్నాడు సునీల్ నరైన్. ఊచకోత కోస్తూ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. అలాంటి కేకేఆర్ ఓపెనర్​కే పోయించాడు ముంబై ఏస్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా. కేకేఆర్-ఎంఐ మధ్య ఈడెన్ గార్డెన్స్​ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినా కోల్​కతా ఆల్రెడీ ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయిపోయింది. అటు ముంబై ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ మ్యాచ్​కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదని అంతా అనుకున్నారు. కానీ పరువు కాపాడుకునే పనిలో ఉన్న హార్దిక్ సేన చెలరేగి ఆడుతోంది. ఆ జట్టు బౌలర్లు దుమ్మురేపుతున్నారు.

స్కోరు బోర్డు మీదకు 10 పరుగులు కూడా చేరకుండానే కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయింది. ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్​కు చేరారు. తొలుత ఫిల్ సాల్ట్​ (6)ను నువాన్ తుషార వెనక్కి పంపాడు. ఆ తర్వాత డేంజరస్ నరైన్​ (0)ను బుమ్రా ఔట్ చేశాడు. అతడు వేసిన యార్కర్​కు నరైన్ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. బుమ్రా వేసిన బంతి లైన్​ను అర్థం చేసుకోలేకపోయాడు కేకేఆర్ ఓపెనర్. అతడు బ్యాట్ ఎత్తేలోపే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బుల్లెట్ వేగంతో దూసుకొచ్చిన బంతి వికెట్లను చెల్లాచెదురు చేసింది. దీంతో షాకైన నరైన్ ఏం జరిగిందో తెలియక జస్ట్ చూస్తూ ఉండిపోయాడు. ఈ డెలివరీ చూసిన నెటిజన్స్ ఎంతటోడైనా బుమ్రా యార్కర్​కు గులాం అవ్వాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. బుమ్రా బౌలింగ్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి