IPL 2024.. KKR టీమ్ లోకి ప్రమాదకర ఆటగాడు! ఇక విధ్వంసమే..

ఐపీఎల్ 2024 సీజన్ స్టార్టింగ్ కు ముందు కోల్ కత్తా నైట్ రైడర్స్ ఓ విధ్వంసకర ప్లేయర్ ను జట్టులోకి తీసుకుంది. మరి ఆ ఆటగాడు ఎవరు? పూర్తి వివరాలు..

ఐపీఎల్ 2024 సీజన్ స్టార్టింగ్ కు ముందు కోల్ కత్తా నైట్ రైడర్స్ ఓ విధ్వంసకర ప్లేయర్ ను జట్టులోకి తీసుకుంది. మరి ఆ ఆటగాడు ఎవరు? పూర్తి వివరాలు..

IPL 2024 సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మెగాటోర్నీ మార్చి 22 నుంచి స్టార్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో టీమ్స్ తమ తమ ప్రణాళికలను, ప్లేయర్లను సర్ధుబాటు చేసుకునే పనిలో నిమగ్నమైయ్యాయి. కొందరు స్టార్ ప్లేయర్లు గాయాలబారినపడి ఈ లీగ్ కు దూరం కాగా.. మరికొందరు ఆటగాళ్లకు అనూహ్యంగా జట్టులో చోటు దక్కుతోంది. తాజాగా కోల్ కత్తా నైట్ రైడర్స్ కు చెందిన ఓ స్టార్ ప్లేయర్ వ్యక్తిగత కారణాలతో లీగ్ కు దూరం కావడంతో.. అతడి ప్లేస్ ను విధ్వంసకర ప్లేయర్ తో భర్తీ చేసింది కేకేఆర్.

ఐపీఎల్ 17వ ఎడిషన్ టైటిల్ ను ఎగరేసుకుపోవాలని లీగ్ లో పాల్గొనే అన్ని జట్లు చూస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే మాస్టర్ ప్లాన్స్ తో బరిలోకి దిగుతున్నాయి. టోర్నీ స్టార్ట్ అవ్వడానికి కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో.. ముమ్మర ప్రాక్టీస్ కు సంసిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ యాజమాన్యం ఓ విధ్వంసకర ఆటగాడిని జట్టులోకి తీసుకుంది. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ కు దూరంగా ఉండనున్నాడు స్టార్ ప్లేయర్ జేసన్ రాయ్. దీంతో అతడి ప్లేస్ ను ఇంగ్లండ్ కే చెందిన విధ్వంసకర యువ బ్యాటర్ ఫిల్ సాల్ట్ తో భర్తీ చేసింది.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే? 2024 ఐపీఎల్ మినీ వేలంలో సాల్ట్ అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడిన సాల్ట్ ను వేలానికి ముందు రివీల్ చేయగా.. ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. ఇప్పుడు కేకేఆర్ యాజమాన్యం రూ.1.5 కోట్ల రిజర్వ్ ధరకు సాల్ట్ ను సొంతం చేసుకుంది. 27 ఏళ్ల ఫిల్ సాల్ట్ కు ప్రపంచ క్రికెట్ లో విధ్వంసకర బ్యాటర్ గా పేరుంది. తక్కువ అనుభవం, తక్కువ మ్యాచ్ లే ఆడినప్పటికీ.. పరిస్థితులను బట్టి వేగంగా పరుగులు రాబట్టడంలో సిద్ధహస్తుడు సాల్ట్. పైగా ఐపీఎల్ లో అతడి స్ట్రైక్ రేట్ 163.9గా ఉంది. ఈ లీగ్ లో 9 మ్యాచ్ ల్లో రెండు ఫిఫ్టీలు సాధించాడు. మరి అన్ సోల్డ్ ప్లేయర్ ను టీమ్ లోకి తీసుకున్న కేకేఆర్ కు అతడు ఏ మేర న్యాయం చేస్తాడో వేచిచూడాలి.

ఇదికూడా చదవండి: ప్రియురాలిని పెళ్లాడిన విధ్వంసకర బ్యాటర్.. ఫొటోలు వైరల్

Show comments