పోలార్డ్‌.. 5 బంతుల్లో 5 సిక్సులు! ఎవరి బౌలింగ్‌లో కొట్టాడో తెలిస్తే గుండె ఆగిపోద్ది!

Kieron Pollard, Rashid Khan, The Hundred League 2024: టీ20 క్రికెట్‌కు మారుపేరు లాంటి పోలార్డ్‌.. మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 5 సిక్సులు బాదాడు. అది కూడా తోపు బౌలర్‌ వేసిన ఓవర్లో కొట్టాడు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Kieron Pollard, Rashid Khan, The Hundred League 2024: టీ20 క్రికెట్‌కు మారుపేరు లాంటి పోలార్డ్‌.. మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 5 సిక్సులు బాదాడు. అది కూడా తోపు బౌలర్‌ వేసిన ఓవర్లో కొట్టాడు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

విధ్వంసకర బ్యాటర్‌ కీరన్‌ పొలార్డ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయినా.. తనలో ఇంకా పవర్‌ తగ్గలేదని నిరూపించాడు. టీ20 క్రికెట్‌కు మారు పేరుగా ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ విండీస్‌ వీరుడు.. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత ఫ్రాంచైజ్‌ క్రికెట్‌లో తన సత్తా చాటుతున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్‌ లీగ్‌ 2024లో విధ్వంసం సృష్టించాడు. వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సులు కొట్టి దుమ్మురేపాడు. వంద బంతుల ఇన్నింగ్స్‌గా సాగే ది హండ్రెడ్‌ లీగ్‌లో ప్రతి బౌలర్‌.. ఒక ఓవర్‌కు ఐదు బంతులు వేస్తాడు. ఆ లెక్కన ఓకే ఓవర్‌లో అన్ని బంతులు సిక్సులు కొట్టాడు పోలార్డ్‌.

పైగా కొట్టింది ఏ ఆర్డినరీ బౌలర్‌నో కాదు.. వరల్డ్‌ క్లాస్‌ బౌలర్‌నే. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో తన మ్యాజిక్‌ స్పిన్‌తో హేమాహేమీ బ్యాటర్లను వణికించిన.. మోడ్రన్‌ గ్రేట్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సులు బాదాడు. ఇప్పటికే పోలార్డ్‌కు టీ20ల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన రికార్డు ఉంది. ఇప్పుడు ది హండ్రెడ్‌ లీగ్‌లో కూడా ఐదు బంతులు ఓవర్‌లో అన్నీ బాల్స్‌కు సిక్సులు కొట్టిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. శనివారం సౌతాంప్టన్‌లోని ది రోజ్‌ బౌల్‌ స్టేడియంలో సదరన్ బ్రేవ్, ట్రెంట్ రాకెట్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది.

ఈ మ్యాచ్‌లో ట్రెంట్‌ రాకెట్స్‌ తరఫున ఆడుతున్న రషీద్‌ ఖాన్‌.. 80, 81, 82, 83, 84, 85 బంతులను వేశాడు. ఆ వరుస బంతుల్లో సదరన్‌ బ్రేవ్స్‌ తరఫున ఆడుతున్న పోల్డార్‌.. భారీ షాట్లతో విరుచుకుపడి.. ఐదు బంతుల్లోనూ సిక్సులు కొట్టేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ట్రెంట్‌ రాకెట్స్‌ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఇక సదరన్‌ బ్రేవ్స్‌ 99 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి నెగ్గింది. పోలార్డ్‌ 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 45 పరుగులు చేసి రాణించాడు. మరి ఈ మ్యాచ్‌లో పోలార్డ్‌ ఐదు సిక్సులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments