iDreamPost
android-app
ios-app

వీడియో: విధ్వంసానికి రెడీ అవుతున్న పొలార్డ్ కొడుకు! బౌలర్లకు చుక్కలే!

  • Published Apr 02, 2024 | 3:05 PM Updated Updated Apr 02, 2024 | 3:05 PM

Kieron Pollard son Kaiden Pollard: క్రికెట్ లోకి మరో వారసుడు వచ్చేస్తున్నాడు. విండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ కొడుకు కైడెన్ పొలార్డ్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Kieron Pollard son Kaiden Pollard: క్రికెట్ లోకి మరో వారసుడు వచ్చేస్తున్నాడు. విండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ కొడుకు కైడెన్ పొలార్డ్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Apr 02, 2024 | 3:05 PMUpdated Apr 02, 2024 | 3:05 PM
వీడియో: విధ్వంసానికి రెడీ అవుతున్న పొలార్డ్ కొడుకు! బౌలర్లకు చుక్కలే!

సాధారణంగా ఏ రంగంలోనైనా తన కొడుకును తనంతటి వాడిని చేయాలని అనుకుంటాడు తండ్రి. అయితే ఇందుకు కొందరు ఫాదర్స్ వ్యతిరేకం. తన వారసుడు ఏం కావాలన్నది వారికే వదిలేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఓ కుర్రాడు తన తండ్రి బాటలో నడిచేందుకు సిద్దమవుతున్నాడు. ఆ కుర్రాడు ఎవరో కాదు.. విండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పొలార్డ్ కొడుకు. ప్రస్తుతం పొలార్డ్ ముంబై ఇండియన్స్ కు బ్యాటింగ్ కోచ్ గా సేవలు అందిస్తున్నాడు. ఇక ఎంఐ క్యాప్ లో తన కొడుకు కైడెన్ పొలార్డ్ కు బ్యాటింగ్ లో మెలకువలు నేర్పిస్తున్నాడు. స్వయంగా కొడుక్కి బౌలింగ్ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కీరన్ పొలార్డ్.. విధ్వంసానికి మరోపేరు ఈ విండీస్ యోధుడు. బ్యాటింగ్ కు దిగాడంటే చాలు.. బంతి స్టాండ్స్ లో పడాల్సిందే. అంతలా బాదుతూ.. బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటాడు పొలార్డ్. అయితే కేవలం బ్యాటింగే కాకుండా.. నిఖార్సైన బౌలర్ గా గుర్తింపు తెచ్చుకుని స్టార్ ఆల్ రౌండర్ గా టీమ్ కు సేవలందించాడు. పలు లీగ్స్ లో ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఈ విండీస్ ప్లేయర్. అయితే తన తర్వాత ప్రేక్షకులను అలరించడానికి కొడుకును సిద్ధం చేస్తున్నాడు. కైడెన్ పొలార్డ్ ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్వయంగా తండ్రి బౌలింగ్ చేస్తుంటే.. నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు జూనియర్ పొలార్డ్. ముంబై ఇండియన్స్ జెర్సీతో సాధన చేస్తుండటంతో.. త్వరలోనే తన తండ్రి పాత్రను పోషించే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అచ్చం పొలార్డ్ లానే బ్యాటింగ్ చేస్తున్నాడు ఈ బుడతడు. కొన్ని షాట్స్ అయితే.. పొలార్డ్ నే గుర్తుకుతెచ్చేలా ఉన్నాయి. కైడెన్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ తన షోల్ మీడియలో పంచుకుంది. మరి తండ్రికి తగ్గ తనయుడిగా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. పొలార్డ్ లానే జూనియర్ కూడా ప్రత్యర్థి బౌలర్లపై సిక్సుల వర్షం కురిపిస్తాడా? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Mumbai Indians (@mumbaiindians)

ఇదికూడా చదవండి: అడుగడుగునా అవమానాలు.. ఇది హార్దిక్ తప్పు కాదు.. ముమ్మాటికీ ముంబైదే!

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş