Somesekhar
తాను గత నాలుగున్నరేళ్లు అనుభవించానని, ప్రతిరోజూ మానసికంగా ఓ యుద్ధమే చేశానని చెప్పుకొచ్చాడు టీమిండియా స్టార్ క్రికెటర్. ఆ ప్లేయర్ ఎవరు? ఎందుకు ఆ బాధను ఎదుర్కొన్నాడు? ఆ వివరాల్లోకి వెళితే..
తాను గత నాలుగున్నరేళ్లు అనుభవించానని, ప్రతిరోజూ మానసికంగా ఓ యుద్ధమే చేశానని చెప్పుకొచ్చాడు టీమిండియా స్టార్ క్రికెటర్. ఆ ప్లేయర్ ఎవరు? ఎందుకు ఆ బాధను ఎదుర్కొన్నాడు? ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీమిండియాకు ఆడాలనేది ప్రతీ ఒక్క యంగ్ క్రికెటర్ల కల. ఇక ఆ కల కోసం ఎన్నో కష్టాలను, నష్టాలను భరిస్తూ.. ముందుకు సాగుతుంటారు ఆ ప్లేయర్లు. అయితే కొన్ని సార్లు అనుకోని సంఘటనలు ఆ ఆటగాళ్లను కుదిపేస్తుంటాయి. ఆ టైమ్ లో తాము అనుభవించిన బాధను సందర్భం వచ్చినప్పుడు ప్రపంచానికి వెళ్లడిస్తూ ఉంటారు. దీంతో అతడిలో ఇంత బాధ ఉందా అని తెలుస్తుంది. అలాంటి ఓ బాధనే తాను గత నాలుగున్నరేళ్లు అనుభవించానని, ప్రతిరోజూ మానసికంగా ఓ యుద్ధమే చేశానని చెప్పుకొచ్చాడు టీమిండియా స్టార్ క్రికెటర్, ఢిల్లీ పేసర్. ఆ వివరాల్లోకి వెళితే..
ఖలీల్ అహ్మద్.. టీమిండియాలోకి దూసుకొచ్చిన యువ కెరటం. తన పేస్ బౌలింగ్ తో ఈ ప్రపంచాన్ని ఆకర్షించాడు. కానీ గాయలు ఇబ్బంది పెట్టడంతో.. జట్టులో తరచుగా చోటు కోల్పోవాల్సి వచ్చింది. 2018లో టీమిండియాలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ పేసర్.. చివరి సారిగా 2019లో టీమిండియా తరఫున మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో ట్రావెల్ రిజర్వ్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే తాను పడ్డ కష్టాలను చెప్పుకొచ్చాడు.
“చివరిసారిగా నేను 2019లో భారత్ కు ఆడాను. అప్పటి నుంచి మళ్లీ ఇప్పటి వరకు ఎప్పుడు టీమిండియాకు ఆడతానా? అంటూ ఎదురుచూస్తూనే ఉన్నాను. ఈ నాలుగున్నరేళ్లు నేను ఎంతో మానసిక క్షోభకు గురైయ్యాను. ప్రతిరోజూ ఓ యుద్ధం చేస్తున్నట్లుగానే ఉండేది. టీమిండియా మ్యాచ్ లు ఆడుతుంటే.. నేను టీమ్ లో ఉంటే ఇలా ఆడేవాడిని అంటూ ఊహించుకునే వాడిని. నా మైండ్ లో ఎప్పుడూ అవే ఆలోచనలు చక్కర్లు కొట్టేవి. ఇక టీ20 వరల్డ్ కప్ లో రిజర్వ్ ప్లేయర్ గా అవకాశం దక్కడం సంతోషంగా ఉంది” అంటూ అతడు పడిన బాధను చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే డొమెస్టిక్ క్రికెట్ ఆడటానికి తాను ఎప్పుడూ సిద్దంగా ఉంటానని ఖలీల్ అహ్మద్ పేర్కొన్నాడు. అయితే ఫాస్ట్ బౌలర్ గా ఇది కాస్త క్లిష్టమైన పనే అయినప్పటికీ.. క్రికెట్టే నా జీవితం కాబట్టి దానికోసం ఎప్పుడో మానసికంగా సిద్ధమైయ్యానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఖలీల్. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ లో 14 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. మరి గాయాల కారణంగా జట్టులో చోటు కోల్పోయి మానసిక యుద్ధం చేసి.. తిరిగొచ్చిన ఖలీల్ అహ్మద్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.