SNP
Kevin Sinclair: క్రికెట్‌లో ఆటగాళ్లు సెంచరీ చేసినా, వికెట్ తీసినా ఆ సంతోషంలో సెలబ్రేట్ చేసుకోవడం కామన్. కానీ, సార్లు వాళ్లు చేసిన ప్రదర్శన కంటే వాళ్లు చేసుకునే సెలబ్రేషన్స్ హైలెట్‌గా మారుతాయి. అలాంటి సెలబ్రేషనే ఇది.
Kevin Sinclair: క్రికెట్‌లో ఆటగాళ్లు సెంచరీ చేసినా, వికెట్ తీసినా ఆ సంతోషంలో సెలబ్రేట్ చేసుకోవడం కామన్. కానీ, సార్లు వాళ్లు చేసిన ప్రదర్శన కంటే వాళ్లు చేసుకునే సెలబ్రేషన్స్ హైలెట్‌గా మారుతాయి. అలాంటి సెలబ్రేషనే ఇది.
SNP
క్రికెట్‌లో రకరకాల సెలబ్రేషన్స్ చూస్తుంటాం. బ్యాటర్ సెంచరీ చేసినా.. బౌలర్ వికెట్ తీసినా.. సంతోషంలో సెలబ్రేట్ చేసుకుంటారు. కొంతమంది క్రికెటర్లకు వాళ్లకంటూ ప్రత్యేకమైన ట్రేడ్ మార్క సెలబ్రేషన్స్ ఉన్నాయి. జడేజా బ్యాట్‌ను ఖడ్గం తిప్పినట్లు తిప్పి సెలబ్రేట్ చేసుకుంటాడు. వార్నర్ గాల్లోకి అమాంతం దూకి సెలబ్రేట్ చేసుకుంటాడు.. అలాగే శుబ్‌మన్ గిల్, కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇలా వీళ్లందరికీ ప్రత్యేకమైన సెలబ్రేషన్ స్టైల్ ఉంది. అలాగే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సైతం సెంచరీ తర్వాత ఆకాశం వైపు చూస్తూ.. సెలబ్రేట్ చేసుకునే వాడు. అలా బౌలర్లలోనూ కొంతమంది స్పెషల్ సెలబ్రేషన్స్ స్టైల్ ఉంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రికెటర్ మాత్రం.. కళ్లు చెదిరే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. బహుషా క్రికెట్‌లో ఇంతకు ముందెవరూ ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదేమో. క్రికెట్‌లో ఏకంగా కార్ట్ వీల్‌లా, జిమ్నాస్టిక్స్ చేస్తున్నట్లు గాల్లోకి వెనక వైపు పల్టీలు కొడుతూ.. వికెట్ తీసిన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.
తన కెరీర్‌లో తొలి వికెట్ కావడంతో అతని ఇంత వెరైటీగా సెలబ్రేట్ చేసుకుని ఉంటాడు. ఇంతకీ ఇంత స్పెషల్‌గా గాల్లో పల్టీలు కొట్టి తన సంతోషాన్ని చాటుకున్న క్రికెటర్ ఎవరంటే.. వెస్టిండీస్‌కు చెందిన కెవిన్ సింక్లైర్. ఈ కరేబియన్ క్రికెటర్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అ అద్భుతమైన ఫీట్ చేశాడు. గాబా వేదికగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వికెట్ తీసిన కెవిన్ సింక్లైర్ గాల్లోకి వెనుక వైపు పల్టీ కొట్టి ఔరా అనిపించాడు. ప్రస్తుతం అతను చేసుకున్న సెలబ్రేషన్స్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. అతను కొట్టిన పల్టీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేకాడిస్తోంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 48వ ఓవర్ వేశాడు.. ఆ ఓవర్ నాలుగో బంతికి ఖవాజా స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వెంటనే వెనక్కి పల్లీ కొట్టిన కెవిన్ సింక్లైర్ గాల్లోనే ఒక రౌండ్ కొట్టాడు. టెస్టు కెరీర్‌లో కెవిన్ సింక్లైర్‌కు ఇదే తొలి వికెట్ కావడంతో అతను ఆ రేంజ్‌లో సంబురాలు చేసుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేసింది. 64 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా.. తర్వాత అద్భుతంగా పుంజుకుని 311 రన్స్ చేసి ఆలౌట్ అయింది. కావెం హాడ్జ్ 71, జాషువా డా సిల్వా 79, కెవిన్ సింక్లైర్ 50 హాఫ్ సెంచరీలతో రాణించారు. అలాగే అల్జారీ జోసెఫ్ సైతం 32 రన్స్ చేశాడు. ఇక ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 4, హెజల్‌వుడ్, లియోన్ రెండేసి వికెట్ల పడగొట్టారు. ఇక ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖవాజా 75, అలెక్స్ క్యారీ 65, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 64 పరుగులతో రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో కెవిన్ సింక్లైర్ స్పెసల్ సెలబ్రేషన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
THIS CELEBRATION OF KEVIN SINCLAIR IS SPECIAL…!!! 🤯💥pic.twitter.com/jL1nerfuUK
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 26, 2024