iDreamPost
android-app
ios-app

వీడియో: క్రికెట్‌లో మరోసారి జిమ్నాస్టిక్‌ సెలబ్రేషన్స్‌! మీరు చూశారా?

  • Published Jul 19, 2024 | 11:37 AM Updated Updated Jul 19, 2024 | 11:37 AM

Kevin Sinclair, Harry Brook, ENG vs WI: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్‌ బౌలర్‌ చేసుకున్న సెలబ్రేషన్స్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారింది. మరి ఆ బౌలర్‌ ఎవరు? అతను ఎలాంటి సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Kevin Sinclair, Harry Brook, ENG vs WI: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్‌ బౌలర్‌ చేసుకున్న సెలబ్రేషన్స్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారింది. మరి ఆ బౌలర్‌ ఎవరు? అతను ఎలాంటి సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jul 19, 2024 | 11:37 AMUpdated Jul 19, 2024 | 11:37 AM
వీడియో: క్రికెట్‌లో మరోసారి జిమ్నాస్టిక్‌ సెలబ్రేషన్స్‌! మీరు చూశారా?

అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలర్‌ వికెట్‌ తీసిన తర్వాత చేసుకునే సెలబ్రేషన్స్‌ ఎప్పుడూ స్పెషలే. ఎందుకంటే మ్యాచ్‌ను ఒక్క బంతితో మలుపుతిప్పే సత్తా బౌలర్‌కు మాత్రమే ఉంటుంది. అయితే.. వికెట్‌ తీసిన తర్వాత సెలబ్రేషన్స్‌లో కొంతమంది బౌలర్లకు ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అది వారి ట్రెడ్‌మార్క్‌ సెలబ్రేషన్స్‌గా పేర్కొంటారు. ఐపీఎల్‌ 2024లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు ఫ్లైయింగ్‌ కిస్‌ ఇచ్చిన కేకేఆర్‌ బౌలర్‌ ఎంత ఫేమస్‌ అయ్యాడో చూశాం. అలాంటి వెరైటీ సెలబ్రేషన్స్‌ చేసుకునే వెస్టిండీస్‌ బౌలర్‌ కెవిన్ సింక్లైర్ మరోసారి తన జిమ్నాస్టిక్‌ సెలబ్రేషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కెవిన్ సింక్లైర్ గాల్లోకి పల్టీ కొడుతూ చేసుకున్న సెలబ్రేషన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 42వ ఓవర్‌ రెండో బంతికి ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ స్కూప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. ఆ బాల్‌ కాస్త మిస్‌ టైమ్‌ అయి.. గాల్లోకి లేచింది. గాల్లోకి లేసిన బాల్‌ను షార్ట్‌ లెగ్‌లో ఉన్న కిర్క్ మెకెంజీ చాలా ఈజీగా ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తనకు దక్కిన తొలి వికెట్‌ కావడంతో కెవిన్‌ సింక్లైర్‌ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. వికెట్‌ పడిన వెంటనే గాల్లోకి పల్టీ కొడుతూ.. తన ట్రెడ్‌మార్క్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. అతని సెలబ్రేషన్స్‌ చూస్తూ.. జిమ్నాస్టిక్స్‌ నేర్చుకున్నాడా? అని అనిపిస్తుంది.

గతంలోనూ ఇలాంటి సెలబ్రేషన్స్‌తో కెవిన్‌ సింక్లైర్‌ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. గురువారం ప్రారంభం అయిన తొలి టెస్టులో వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓలీ పోప్‌ 121, బెన్‌ డకెట్‌ 71, బెన్‌ స్టోక్స్‌ 69 పరుగులు చేసి రాణించారు. వెస్టిండీస్‌ బౌలర్లలో అల్జారీ జోసెఫ్‌ 3, జైడెన్‌ 2, కెవిన్‌ సింక్లైర్‌ 2, కావెం హాడ్జ్ 2 వికెట్లతో రాణించారు. షమర్‌ జోసెఫ్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో కెవిన్‌ సింక్లైర్‌ జిమ్నాస్టిక్‌ సెలబ్రేషన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.