Somesekhar
టీమిండియాతో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు ముందు తమ జట్టు ఆటగాళ్లకు జాగ్రత్తలు చెప్పాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్. భారత్ ను ఈ సిరీస్ లో ఓడించాలి అంటే ఆ టీమిండియా క్రికెటర్ ను దెబ్బకొట్టాలని సూచించాడు.
టీమిండియాతో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు ముందు తమ జట్టు ఆటగాళ్లకు జాగ్రత్తలు చెప్పాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్. భారత్ ను ఈ సిరీస్ లో ఓడించాలి అంటే ఆ టీమిండియా క్రికెటర్ ను దెబ్బకొట్టాలని సూచించాడు.
Somesekhar
టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ త్వరలోనే ప్రారంభం కానుంది. జనవరి 25న హైదరాబాద్ వేదికగా తొలి పోరు స్టార్ట్ అవ్వనుంది. ఇక ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ మెుదలుపెట్టింది. ఆఫ్గానిస్తాన్ పై చూపించిన జోరునే ఇంగ్లాండ్ జట్టుపైనా చూపించాలని భావిస్తోంది రోహిత్ సేన. పైగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25లో ఇది కీలక సిరీస్. దాంతో ఇరు జట్టు ఎలాగైనా ఈ టెస్ట్ సిరీస్ ను దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ జట్టు ఆటగాళ్లకు పలు సూచనలు చేశాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు పీటర్సన్. భారత జట్టును ఓడించాలి అంటే ముందు అతడిని దెబ్బతీయాలని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
జనవరి 25 నుంచి ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే సిద్దమైయ్యాయి. ఇక ఇప్పటికే తొలి రెండు టెస్ట్ మ్యాచ్ లకు జట్టును ప్రకటించింది టీమిండియా. ఆఫ్గానిస్తాన్ పై సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి మంచి జోరుమీదుంది భారత జట్టు. ఇదిలా ఉండగా.. టీమిండియాను ఓడించాలంటే ఏం చేయాలో తమ జట్టు ఆటగాళ్లకు పలు సూచనలు చేశాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్. టీమిండియాను ఓడించాలి అంటే ముందుగా మీరు రవిచంద్రన్ అశ్విన్ ను దెబ్బతీయాలని ఇంగ్లాండ్ ఆటగాళ్లకు సూచించాడు పీటర్సన్. ఈ సందర్భంగా తాను 2012లో అశ్విన్ ను ఎదుర్కొన్న సిరీస్ ను గుర్తు చేశాడు. ప్రముఖ మీడియా ఛానల్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ..
“అశ్విన్ చాలా తెలివైన బౌలర్. అతడు బౌలింగ్ వేసే విధానం మీరు గమనించినట్లైతే.. బాల్ ను లోడ్ చేసేటప్పుడు రన్నింగ్ లో తన చేతులను వెనక్కి పెట్టుకుని ఉంటాడు. దీంతో ఎలాంటి బాల్ వేస్తాడు? అన్న సందిగ్దత బ్యాటర్ కు ఉంటుంది. దీంతో కన్య్పూజన్ అయ్యి.. వికెట్ సమర్పించుకునే అవకాశం ఉంది. నాకు తెలిసి, అశ్విన్ ఈ సిరీస్ లో కూడా అలాగే చేస్తాడు. పైగా ఆఫ్ స్పిన్ వేసేందుకు బాల్ ను చేతిలో పట్టుకుని పరిగెత్తడు, క్షణాల్లో ఆ బాల్ ను దూస్రాగా మార్చగలడు. మీరు దాన్ని ఊహించలేరు. నేను 100 శాతం చెప్పగలను అతడు ఈ సిరీస్ లో కూడా ఇలా చేస్తాడని. అశ్విన్ తన మార్క్ దుస్రాను వేసినప్పుడు నా మైండ్ లో సిక్స్, ఫోర్ కొట్టాలనే ఆలోచన రానే రాలేదు” అంటూ అశ్విన్ గురించి చెప్పుకొచ్చాడు పీటర్సన్. మీరు అశ్విన్ పై ఎదురుదాడికి దిగి, అతడిని ఒత్తిడిలోకి నెట్టితేనే టీమిండియాను ఓడించవచ్చని పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా టీమిండియా స్పిన్నర్ జడేజా గురించి కూడా చెప్పుకొచ్చాడు పీటర్సన్. “జడేజాను నేను చాలా సార్లు ఎదుర్కొన్నాను. అయితే అతడు ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ లాంటి స్పిన్నర్ కాదు. జడేజా ఎప్పుడు ఒకేతీరు బంతులను సంధిస్తూ ఉంటాడు. అయితే అప్పుడప్పుడు మాత్రం కొన్ని బాల్స్ ను తిప్పుతూ ఉంటాడు. మీరు క్రీజ్ లో సరైన ఫుట్ వర్క్ తో ఉంటే జడేజా వేసిన బంతులను సులువుగా ఆడొచ్చు. లేకపోతే ఎల్బీ అయ్యే లేదా బౌల్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి” అంటూ తమ ఆటగాళ్లను ముందే హెచ్చరించాడు మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్. 2012లో ముంబైలో తాను ఆడిన 186 పరుగుల ఇన్నింగ్స్ ను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు పీటర్సన్. జడేజాతో పాటుగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లాంటి అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారని కితాబిచ్చాడు ఈ ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు. మరి టీమిండియా స్పిన్నర్ల విషయంలో తమ ఆటగాళ్లకు ముందే వార్నింగ్ ఇచ్చిన కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.