iDreamPost
android-app
ios-app

KC Cariappa: తనో వ్యభిచారి.. మాజీ ప్రేయసిపై కేసు పెట్టిన స్టార్‌ క్రికెటర్‌!

  • Published Dec 25, 2023 | 11:37 AM Updated Updated Dec 25, 2023 | 11:37 AM

స్నేహం, ప్రేమ, బ్రేక్‌ అప్‌ ఈ రోజుల్లో చాలా కామన్‌ అయిపోయాయి. కానీ, ఇవన్ని లిమిట్స్‌లో ఉంటేనే కామన్‌.. కానీ, హద్దులు దాటితే జీవితాలు రోడ్డున పడతాయి. అది సామాన్యులకైనా, సెలబ్రెటిలకైనా.. తాజాగా ఓ క్రికెటర్‌ ప్రేమ, తర్వాత పరిణామాలతో పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూడండి.

స్నేహం, ప్రేమ, బ్రేక్‌ అప్‌ ఈ రోజుల్లో చాలా కామన్‌ అయిపోయాయి. కానీ, ఇవన్ని లిమిట్స్‌లో ఉంటేనే కామన్‌.. కానీ, హద్దులు దాటితే జీవితాలు రోడ్డున పడతాయి. అది సామాన్యులకైనా, సెలబ్రెటిలకైనా.. తాజాగా ఓ క్రికెటర్‌ ప్రేమ, తర్వాత పరిణామాలతో పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూడండి.

  • Published Dec 25, 2023 | 11:37 AMUpdated Dec 25, 2023 | 11:37 AM
KC Cariappa: తనో వ్యభిచారి.. మాజీ ప్రేయసిపై కేసు పెట్టిన స్టార్‌ క్రికెటర్‌!

ఐపీఎల్‌లో చాలా కాలంగా ఆడుతున్న.. పెద్దగా పరిచయం లేని క్రికెటర్‌ తాజాగా ఓ వివాదంతో వార్తల్లోకి ఎక్కాడు. రెండేళ్ల క్రితం అతని ప్రేయసి పెట్టిన పోలీస్‌ కేసుతో హెడ్‌లైన్స్‌లో నిలిచిన ఆ క్రికెటర్‌.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆమెపై కేసు పెట్టి.. మళ్లీ వార్తల్లో​కి ఎక్కాడు. కర్ణాటకకు చెందిన కేసీ కరియప్ప అనే దేశవాళీ క్రికెటర్‌.. తన మాజీ ప్రేయసిపై కేసు పెట్టాడు. తన క్రికెట్‌ కెరీర్‌ను ముగించాలని, తనను, తన కుటుంబ సభ్యులను బెదిరింపులకు పాల్పడతుందంటూ కరియప్ప తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళ్తే..

కేసీ కరియప్ప దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రతిభ కనబర్చడంతో.. ఐపీఎల్‌ 2015 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఏకంగా 2.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ తర్వాత పంజాబ్‌ కింగ్స్‌కు, అలాగే రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున కూడా కరియప్ప ఆడాడు. కానీ, పెద్దగా సక్సెస్ కాదు. ఐపీఎల్‌ 2023 వరకు రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌లోనే ఉన్నా.. పెద్దగా మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌ మినీ వేలంలో అన్‌సోల్డ్‌ ప్లేయర్‌గా మిగిలిపోయాడు కరియప్ప. క్రికెట్‌ కెరీర్‌ ఇలా సాగుతున్న క్రమంలో.. తన మాజీ ప్రేయసిపై కేసు పెట్టాడు.

Cricketer filed a case against his girlfriend!

కొన్నేళ్ల క్రితం ఓ స్నేహితురాలితో ప్రేమలో పడ్డ కరియప్ప.. ఆ తర్వాత ఆమెతో విడిపోయాడు. ఆ సమయంలో ఆమె కరియప్పపై కేసు పెట్టింది. తనను గర్భవతిని చేసి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనకు అబార్షన్‌ చేయించాడని, అతని క్రికెట్‌ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని నేను కూడా పూర్తి ఆధారాలు పోలీసులకు సమర్పించలేదని పేర్కొంది. అప్పటి నుంచి ఆ కేసు నడుస్తూనే ఉంది. తాజాగా మళ్లీ కరియప్పనే ఆమెపై కేసు పెట్టాడు. ఆమె డ్రగ్స్‌, మద్యానికి బానిస అయిందని, వ్యభిచారం కూడా చేస్తోందని, అందుకే తన నుంచి విడిపోయానని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మద్యం అలవాటు వానేయాలని ఎన్ని సార్లు చెప్పినా తాను వినలేదని అందుకే విడిపోవాల్సి వచ్చిందని కరియప్ప పోలీస్‌ కంప్లైంట్‌లో పేర్కొన్నారు. తనపై కేసు పెట్టిన మాజీ ప్రేయసిపై.. రెండేళ్ల తర్వాత కరియప్ప కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.