MS Dhoni: ధోని పరువు తీస్తారా? ఇదేనా మీరిచ్చే రెస్పెక్ట్! CSKపై కావ్య సీరియస్!

Kavya Maran: లెజెండ్ ఎంఎస్ ధోని విషయంలో సీఎస్​కే వ్యవహరిస్తున్న తీరుపై సన్​రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్ సీరియస్ అయ్యారని తెలిసింది. మాహీ పరువు తీస్తారా? అంటూ ఆమె ఫైర్ అయ్యారట.

Kavya Maran: లెజెండ్ ఎంఎస్ ధోని విషయంలో సీఎస్​కే వ్యవహరిస్తున్న తీరుపై సన్​రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్ సీరియస్ అయ్యారని తెలిసింది. మాహీ పరువు తీస్తారా? అంటూ ఆమె ఫైర్ అయ్యారట.

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వచ్చే ఐపీఎల్ సీజన్​లో ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది. గత సీజన్​ టైమ్​లో అతడి మోకాలికి గాయమైంది. ఇంజ్యురీ కారణంగా సరిగ్గా ఆడలేకపోయిన మాహీ.. టోర్నీ ముగిశాక కాలికి సర్జరీ చేయించుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్​కు ముందు ఫిట్​నెస్ మీద కాన్​సంట్రేషన్ చేసి రికవర్ అయ్యాడు. అయితే పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సీజన్​లో ఆఖర్లో బ్యాటింగ్​కు దిగుతూ వచ్చాడు. వికెట్ల మధ్య పరుగులు తీయడంలో ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని చివర్లో వచ్చి ఆరేడు బంతులు ఆడుతూ భారీ షాట్లతో ఆడియెన్స్​ను అలరించాడు. దీంతో ఐపీఎల్-2025లో ధోని ఆడతాడా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

ఐపీఎల్-2025కు ముందు మెగా ఆక్షన్ ఉండటంతో ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ రీటెయిన్ చేసుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే మాహీ విషయంలో సీఎస్​కే స్పెషల్​ ప్లాన్​తో ముందుకెళ్లాలని డిసైడ్ అయింది. భారీ ధర పెట్టి ధోనీని రిటెయిన్ చేసుకునే బదులు అతడ్ని అన్​క్యాప్డ్ లిస్ట్​లో పెట్టి తక్కువ అమౌంట్​కే రీటెయిన్ చేసుకోవాలని చూస్తోంది. ఏదైనా ప్లేయర్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరై 5 ఏళ్లు దాటితే అతడ్ని అన్​క్యాప్డ్ ప్లేయర్​గా ప్రకటించేలా ఐపీఎల్​లో ఓ రూల్ ఉండేది. 2008 నుంచి 2021 వరకు లీగ్​లో దీన్ని అమలు చేసి.. ఆ తర్వాత తీసేశారు. మాహీ కోసం దీన్ని మళ్లీ అమలు చేసేలా సీఎస్​కే ప్లాన్ చేస్తోందని తెలిసింది. అయితే దీన్ని సన్​రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్ తీవ్రంగా ఖండించారట.

ధోని పరువు తీస్తున్నారని సీఎస్​కే యాజమాన్యంపై కావ్యా మారన్ సీరియస్ అయ్యారని సమాచారం. మాహీ లాంటి దిగ్గజ ఆటగాడు, సారథికి మీరిచ్చే రెస్పెక్ట్ ఇదేనా? అని ఐపీఎల్ ఓనర్స్​తో బీసీసీఐ నిర్వహించిన మీటింగ్​లో కావ్యా పాప ఫైర్ అయ్యారని వినికిడి. ధోని లాంటి లెజెండ్​ను అన్​క్యాప్డ్ ప్లేయర్​గా ప్రకటించడం గౌరవం కాదని.. ఇది అతడి విలువను తగ్గించినట్లేనని ఆమె స్పష్టం చేశారట. అన్​క్యాప్డ్‌ ప్లేయర్​గా ప్రకటించి అతడ్ని రీటెయిన్ చేసుకోవాలని భావించడం సరికాదని.. మాహీని వేలంలో పెట్టాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారని సమాచారం. ఈ ఒక్క అంశమే కాదు.. గాయం కారణంగా చూపి లీగ్​కు దూరమవుతున్న విదేశీ ఆటగాళ్లను బ్యాన్ చేయాలంటూ మరో డిమాండ్​ను కూడా లేవనెత్తారట ఎస్​ఆర్​హెచ్ కో-ఓనర్. మొత్తానికి బీసీసీఐ మీటింగ్​తో కావ్య పాప బాగా హైలైట్ అయ్యారనే చెప్పాలి. మరి.. ధోనీని సీఎస్​కే అవమానిస్తోందంటూ కావ్య చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments