SNP
Kavya Maran, SRH vs KKR, IPL Final: ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిని తట్టుకోలేక ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Kavya Maran, SRH vs KKR, IPL Final: ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిని తట్టుకోలేక ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. చెన్నైలోని చిదంబరం క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఏకంగా 8 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓటమి పాలైంది. ఈ సారి ఎలాగైనా సన్‌రైజర్స్ హైదరాబాద్ కప్పు కొడుతుందని తెలుగు క్రికెట్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ సైతం ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎంతగానో ఎదురుచూసింది. ఫ్యాన్స్‌తో పాటు కావ్య మారన్‌కు కూడా తీవ్ర నిరాశే ఎదురైంది. అయితే.. ఫైనల్లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమిని తట్టుకోలేకపోయిన కావ్య.. వెనక్కి తిరిగి కన్నీళ్లు పెట్టుకుంది. తనను ఓదార్చేందుకు అక్కడున్న వాళ్లు ప్రయత్నించినా.. తన బాధను కన్నీళ్ల రూపంలో చూపించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ హోల్ అండ్ సోల్‌గా వ్యవహరించే కావ్య మారన్.. ఈ సీజన్‌లో ఎలాగైన కప్పు కొట్టించాలని వేలం నుంచి టీమ్‌ను బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. కమిన్స్‌ను రూ.20.5 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన సమయంలో నుంచి.. ప్రతి విషయంలో ఎంతో ఆచీతూచి వ్యవహరించింది. ఆమె అంచనాలకు తగ్గట్లు టీమ్ కూడా సీజన్ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడింది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా భారీ భారీ రికార్డులు బ్రేక్ చేస్తూ.. కొన్ని కొత్త రికార్డులను నెలకొల్పుతూ.. కొత్త ఎస్‌ఆర్‌హెచ్ టీమ్‌ను తలపించింది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి జట్లు భయపడే స్థాయికి చేరుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు వెళ్లి, క్వాలిఫైయర్-1లో ఓడినా, క్వాలిఫైయర్-2లో నెగ్గి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ, ఫైనల్‌లో కేకేఆర్ చేతిలో ఓటమి పాలై.. రెండో కప్పు కొట్టాలన్న ఆశను అడియాశలు చేసుకుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ కమిన్స్ 24 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం అయ్యారు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ 3, స్టార్క్ 2, హర్షిత్ రాణా 2 వికెట్లతో రాణించారు. ఆరోరా, నరైన్, చక్రవర్తి తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక 114 పరుగుల టార్గెట్‌ను కేకేఆర్ 10.3 ఓవర్లలోనే ముగించింది. వెంకటేశ్ అయ్యర్ 26 బంతుల్లో 52, గుర్బాజ్ 39 పరుగులతో రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్‌కు చెరో వికెట్ దక్కింది. మరి ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమితో పాటు, కావ్య మారన్ కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kavya Maran was hiding her tears. 💔
– She still appreciated KKR. pic.twitter.com/KJ88qHmIg6
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024