iDreamPost
android-app
ios-app

Kavya Maran: IPL 2025.. ఆ ప్లేయర్లను బ్యాన్ చేయాలి! BCCIకి కావ్య మారన్ రిక్వెస్ట్..

  • Published Aug 01, 2024 | 10:16 AM Updated Updated Aug 01, 2024 | 10:16 AM

ముంబైలో ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బుధవారం సమావేశం నిర్వహించింది బీసీసీఐ. అలాంటి ప్లేయర్లను బ్యాన్ చేయాలని ఈ మీటింగ్ లో సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

ముంబైలో ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బుధవారం సమావేశం నిర్వహించింది బీసీసీఐ. అలాంటి ప్లేయర్లను బ్యాన్ చేయాలని ఈ మీటింగ్ లో సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

Kavya Maran: IPL 2025.. ఆ ప్లేయర్లను బ్యాన్ చేయాలి! BCCIకి కావ్య మారన్ రిక్వెస్ట్..

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి నిబంధనలను ఖరారు చేయడానికి ముంబైలో ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బుధవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి అన్ని ఫ్రాంచైజీల యజమానులు హాజరైయ్యారు. ఈ మీటింగ్ లో అన్ని ఫ్రాంచైజీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేయకపోగా.. తమ తమ డిమాండ్స్ ను బీసీసీఐ ముందు ఉంచాయి. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ కొన్ని సూచనలను బీసీసీఐ ముందు ఉంచినట్లు తెలిసింది. ఆ ప్లేయర్లను బ్యాన్ చేయాలని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ మెగావేలానికి సంబంధించి నిబంధనలను రూపొందించడానికి బీసీసీఐ తాజాగా ముంబైలో ఓ సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్ కు అన్ని ఫ్రాంచైజీలు హాజరైయ్యాయి. సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ కూడా ఈ మీటింగ్ కు హాజరై.. తన అభిప్రాయాలను పంచుకుంది. కొన్ని డిమాండ్స్ ను కూడా బీసీసీఐ ముందు కావ్య ఉంచినట్లు తెలుస్తోంది. మీటింగ్ అనంతరం కావ్య మారన్ ఈ విధంగా మాట్లాడింది.

“నెక్ట్స్ ఐపీఎల్ లో కొన్ని నిబంధనలను మార్చాలి. నలుగు ప్లేయర్లను రిటైన్ చేసుకోవడం లేదా ఇద్దరు ఆటగాళ్లను RTM ద్వారా సొంతం చేసుకునేలా ఉండాలి. లేదా 7 ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలి. ప్లేయర్‌తో చర్చించి రిటైన్డ్ లేదా ఆర్‌టీఎమ్‌తో వెళ్లాలా అనే నిర్ణయం తీసుకునేలా అవకాశం ఉండాలి. ఎందుకంటే కొందరు ప్లేయర్లు రిటైన్డ్ కు ఇష్టపడితే.. మరికొందరు ఆర్టీఎమ్ కు సుముఖత వ్యక్తం చేస్తారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయి. ఇక క్యాప్డ్, అన్ క్యాప్డ్, విదేశీ ప్లేయర్ల సంఖ్యను పరిమితం చేయకూడదు. ఈ విషయంలో ఫ్రాంచైజీలకు స్వేచ్ఛ ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే? వేలంలో కొన్న తర్వాత గాయం కారణంగా కాకుండా ఇతర కారణాలతో వైదొలిగే విదేశీ ప్లేయర్లను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలి” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది కావ్య మారన్. మరి ఐపీఎల్ మధ్యలో వైదొలిగే ప్లేయర్లను బ్యాన్ చేయాలన్న కావ్య మారన్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.