Somesekhar
ర్సీబీతో జరిగిన మ్యాచ్ లో SRH టీమ్ ఓడిపోవడంతో.. కావ్య కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ర్సీబీతో జరిగిన మ్యాచ్ లో SRH టీమ్ ఓడిపోవడంతో.. కావ్య కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Somesekhar
కావ్య మారన్.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ గానే కాకుండా, ఈ ఐపీఎల్ సీజన్ కు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తూ వస్తోంది. ఇక తమ టీమ్ ఆడే ప్రతీ మ్యాచ్ కు హాజరౌతూ.. జట్టును ఎంతో ఉత్సహాపరుస్తోంది. ఇక టీమ్ ఆటగాళ్లు సిక్సులు, ఫోర్లు బాదుతుంటే.. కావ్య ఎంతో సంతోషంగా ఇచ్చే రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. అయితే ఇందుకు భిన్నంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో SRH టీమ్ ఓడిపోవడంతో.. కావ్య కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా నిన్న(గురువారం) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అనూహ్యంగా 35 పరుగులతో ఓడిపోయింది. SRH గత మ్యాచ్ ల ఫామ్ ను చూసుకుంటే.. ఈ మ్యాచ్ లో ఈజీగా గెలుస్తుందని అందరూ భావించారు. కానీ ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ బలహీనతను తెలుసుకున్న ఆర్సీబీ వారిని చిత్తుచేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో విరాట్ కోహ్లీ(51), రజత్ పాటిదార్(50) అర్దసెంచరీలతో రాణించారు. అనంతరం 207 పరుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమై 35 రన్స్ తో ఓడిపోయింది. షహబాజ్ అహ్మద్ 40 పరుగులతో చివరి వరకు క్రీజ్ లో నిలిచి టాప్ స్కోరర్ గా ఉన్నాడు.
ఇక ఈ మ్యాచ్ ఓడిపోవడంతో సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ కన్నీళ్లు పెట్టుకుంది. వరుసగా వికెట్లు పడుతుంటే.. చూడలేక తన బాధను వ్యక్తం చేసింది. ఈ రియాక్షన్స్ అన్నీ కెమెరాలో రికార్డు కావడంతో.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎప్పుడూ చలాకీగా, నవ్వుతూ.. హుషారెత్తించే కావ్య ఒక్కసారిగా ఇలా డల్ గా కనిపించడంతో అభిమానులు బాధపడుతున్నారు. ఒక్క మ్యాచే గా మేడం ఓడిపోయింది.. నెక్ట్స్ గెలుద్దాంలే ఫీల్ అవ్వకండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఓదార్చుతున్నారు. ఇక SRH తన తర్వాత మ్యాచ్ చెన్నైతో ఆడనుంది.
#RCB Rocked 😎
Kavya Maran Shocked 😮💨
Congratulations RCB 😍#RCBvsSRH #SRHvRCB#ViratKohli𓃵pic.twitter.com/xISW2H2cWG— Mohammed Aziz (@itsmeaziz07) April 25, 2024