iDreamPost
android-app
ios-app

Karun Nair: మెరుపు సెంచరీతో విరుచుకుపడిన కరుణ్ నాయర్! 13 ఫోర్లు, 9 సిక్సర్లతో..

  • Published Aug 20, 2024 | 7:58 AM Updated Updated Aug 20, 2024 | 7:58 AM

మహారాజా ట్రోఫీలో భాగంగా మంగళూరు డ్రాగన్స్ తో జరిగిన మ్యాచ్ లో మైసూర్ వారియర్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ.. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు.

మహారాజా ట్రోఫీలో భాగంగా మంగళూరు డ్రాగన్స్ తో జరిగిన మ్యాచ్ లో మైసూర్ వారియర్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ.. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు.

Karun Nair: మెరుపు సెంచరీతో విరుచుకుపడిన కరుణ్ నాయర్! 13 ఫోర్లు, 9 సిక్సర్లతో..

మహారాజా ట్రోఫీ KSCA టీ20 టోర్నీలో టీమిండియా ట్రిపుల్ సెంచరీ హీరో, మైసూర్ వారియర్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ విధ్వంసకర సెంచరీతో దుమ్మురేపాడు. టోర్నీలో భాగంగా మంగళూరు డ్రాగన్స్ తో జరిగిన మ్యాచ్ లో థండర్ ఇన్నింగ్స్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. మైసూర్ వారియర్స్ టీమ్ భారీ స్కోర్ సాధించింది. కేవలం 43 బంతుల్లోనే 10 ఫోర్లు, 7 సిక్సర్లతో బ్లాస్టింగ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

మహారాజా ట్రోఫీలో భాగంగా మంగళూరు డ్రాగన్స్ తో జరిగిన మ్యాచ్ లో మైసూర్ వారియర్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ.. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. బౌలర్ ఎవరన్నది కూడా చూడకుండా దంచికొట్టాడు. ఈ క్రమంలో కేవలం 43 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా 48 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 9 సిక్సులతో 124 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 258 ఉండటం విశేషం. కరుణ్ థండర్ ఇన్నింగ్స్ కారణంగా మైసూర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో ఎవ్వరూ కూడా పెద్దగా రాణించలేదు. ద్రవిడ్ కొడుకు సమిత్ 16 రన్స్ మాత్రమే చేశాడు.

అయితే వారియర్స్ ఇన్నింగ్స్ తర్వాత వర్షం రావడంతో.. మంగళూరు డ్రాగన్స్ టార్గెట్ ను వీజేడీ పద్ధతిన 14 ఓవర్లలో 166 పరుగులుగా నిర్ధారించారు. అయితే 166 లక్ష్యంతో బరిలోకి దిగిన డ్రాగన్స్ టీమ్ ఏ దశలోనూ టార్గెట్ వైపు సాగలేదు. 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసి 27 పరుగులతో ఓడిపోయింది. జట్టులో నికిన్ జోష్ 32 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కరుణ్ నాయర్ విధ్వంసకర శతకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.